తెలంగాణ అమర వీరుల కుటుంబాలను ఆదుకుంటాం
Viewed:
288
Times | News ID:
S178311115
|
|
- Posted by
Sriman
on
5/31/2010 11:45:33 PM
in
Karimnagar
,
District News
|
సిరిసిల్ల, మే 30 : తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలం టూ ప్రాణాలను అర్పించిన అమరుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకు నేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలను చేసిన కుటుంబాలను పరామర్శించేందుకు టీఆర్ఎస్ ఓదార్పు యాత్రను ఆదివారం ఆయన ప్రారంభిం చారు.
సిరిసిల్ల మండలంలోని అంకుసా పూర్ గ్రామానికి చెందిన ఉమ్మారెడ్డి తిరుపతి రెడ్డి(22) అనే తెలంగాణ ధూంధాం కళాకారుడు తెలంగాణ రావ డం లేదంటూ జనవరిలో ఒంటిపై కిరో సిన్ పోసుకుని నిప్పంటించుకని చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ కుటుం బాన్ని ఇన్చార్జి వినోద్‌కుమార్, ఎంఎల్‌సి నారదాసు లక్ష్మాణ్రావు, మాజీ ఎమ్మె ల్యేలు కేటీఆర్ రమేశ్‌బాబులు పరామ ర్శించి, అతని తల్లిదండ్రులు ఎల్లవ్వ- హన్మంతరెడ్డిలకు రూ.25వేల నగదును అందజేశారు.
అనంతరం గండి లచ్చ పేట గ్రామానికి చెందిన కాసారపు నారా యణగౌడ్ గుండె ఆగి మృతి చెందగా అతని భార్య సత్తవ్వకు, ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన కె శుగాని శ్రీనివాస్ అనే ఫార్మసీ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడగా అతని తల్లిదం డ్రులు లింగయ్య, ఎల్లవ్వలకు, ఆత్మహ త్యలకు పాల్పడిన కోనరావుపేట మం డల కేంద్రానికి చెందిన గొట్టె కళ్యాణ్ కుటుంబ సభ్యులకు, ఇదే మండ లం లోని రామన్న గ్రామానికి చెందిన అన వేణి జ్యోతి కుటుంబ సభ్యులకు రూ 25 వేల చొప్పున నగదును అందజేశారు.
అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వినోద్‌కుమార్ మాట్లాడుతూ అమరవీరుల కుటుంబా లను ఆదుకోవాలని టీఆర్ఎస్ పార్టీ అధి నేత కేసీఆర్ ఆదే«శాలు జారీచేయడంతో ఈ ఓదార్పుయాత్ర కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్య క్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్యేలు కె. తారక రామారావు, ఆకునూరి శంకరయ్య, మం డల శాఖ అధ్యక్షులు గజభీంకార్ రాజ న్న, పడగెల రాజు, రేణా, వనజ, నర్సిం గారావు, జగత్,స్వామి సర్పంచ్‌లు లక్ష్మి, అంజయ్య, నూనె కిషన్, సుజాత నర్స య్య, లక్ష్మణ్‌గౌడ్, బండి దేవదాస్‌లు పాల్గొన్నారు.
అమరుల ఆత్మత్యాగం వృథా కానివ్వం..
ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు
వేములవాడ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆత్మత్యాగాన్ని వృథా కానివ్వబోమని శా సన మండలి సభ్యుడు నారదాసు లక్ష్మణ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో ఆత్మ త్యాగం చేసిన వేములవాడలోని కీసరి మంజుల కుటుంబ సభ్యులను తెలం గాణ రాష్ట్ర సమితి నేతలు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు చెన్నమనేని రమేశ్, కె.తారకరామారావు, కొప్పుల ఈశ్వర్లు పరామర్శించారు.
ఈ సందర్భంగా మంజుల కుటుంబ సభ్యు లకు చెన్నమనేని రమేశ్ రూ. 25 వేల ఆర్థిక సహాయం అందించారు. అనం తరం నారదాసు లక్ష్మణరావు మాట్లాడు తూ కెసిఆర్ దీక్షలో ఉన్న సమయంలోనే మంజుల ప్రాణత్యాగం చేసిందని, కోన రావుపేటకు చెందిన కళ్యాణ్, రామ న్నపేటకు చెందిన జ్యోతి సైతం తెలం గాణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాలను మరిచి పో కుండా పోరాటాన్ని మరింత ఉ«ధృతం చేస్తామని అన్నారు.
మంజుల కుమా రుడు సాయిని ఉన్నత చదువులు చదివించేందుకు తోడ్పాటు అందిస్తానని మాజీ ఎమ్మెలే ్య చెన్నమనేని రమేశ్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జడ్పీ వైస్ చైర్మన్ తీగల రవీం దర్‌గౌడ్, సెస్ డైరెక్టర్ మాదాడి గజా నందరావు, నాయకులు ఎర్రం మహేశ్, పీచర భాస్కర్‌రావు, ముప్పిడి శ్రీనివాస్, హింగె కుమార్, కీసరి దేవరాజు తదిత రులు ఈ సందర్భంగా వారి వెంట ఉన్నారు.
అధిష్ఠానం వద్దన్నా యాత్ర చేయడంలో ఆంతర్యమేమిటి..?
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వద్దన్నా కడప ఎంపీ జగన్ వరంగల్ జిల్లాలో ఓదార్పు యాత్రకు బయలుదేరడంలో ఆంతర్యమేమిటని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపిీ బోయి నపల్లి వినోద్‌కుమార్ ప్రశ్నించారు. వేము లవాడ మండలం మల్లారం గ్రామంలో శనివారం రాత్రి నిర్వహించిన ధూం.. ధాం.. కార్యక్రమంలో ఆయన మాట్లా డారు. తెలంగాణపై ఆధిపత్యం కోసమే జగన్ ఓదార్పు యాత్రకు రూపకల్పన చేశారని, తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చడమే ఓదార్పు యాత్ర అసలు లక్ష్య మని అన్నారు.
ఈ సందర్భంగా కళా కారులు నిర్వహించిన ధూం.. ధాం.. ఆక ట్టుకుంది. ఇదిలా ఉండగా, గ్రామంలో రూ. 5 లక్షల వ్యయంతో సేవ్స్ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్‌ను మాజీ ఎమ్మెల్యే చెన్న మనేని రమేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పి వైస్ చైర్మన్ తీగల రవీందర్‌గౌడ్, సెస్ డైరెక్టర్ మాదాడి గజానందరావు, సర్పంచ్ వెంగళ వెంక టిగౌడ్, ఎంపీటీసీ సభ్యురాలు మల్లారం లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.
|
|
|
|