వడదెబ్బతో 11 మంది మృతి
Viewed:
279
Times | News ID:
S1012784
|
|
- Posted by
Sriman
on
5/27/2010 8:34:35 PM
in
Karimnagar
,
District News
|
శంకరపట్నం: మండలంలోని గద్దపాక గ్రామ పంచా యతీ పరిధిలోని కల్వలకు చెందిన అబ్బాస్ బేగ్ (50) బుధవారం వడ దెబ్బతో మృతి చెందినట్లు గ్రామస్తు లు తెలిపారు. అబ్బాస్ బేగ్ కుటుంబ సభ్యుల ను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీటీసీ భూమ సంపత్, సర్పంచ్ అంజలి ప్రభుత్వాన్ని కోరారు.
జగిత్యాల రూరల్,: మండలంలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన కేతినేని మల్లయ్య బుధవారం వడదెబ్బతో మృ తి చెందాడు. కూలీ పని కోసం బుధ వారం జగిత్యాలకు వచ్చిన ఆయన వడదెబ్బ తగులడంతో పట్టణంలోని గొల్లపల్లి రోడ్ పక్కన పడిపోయాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.
భీమదేవరపల్లి: మండలంలోని మాణిక్యాపూర్ గ్రామశివారులో «ము ప్పు రాజయ్య(60) అనే వృద్దుడు వడ దెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామ స్తులు తెలిపారు. ధర్మారం గ్రామానికి చెందిన ముప్పురాజయ్య పుట్టు అం ధుడు.
వెల్గటూర్: మండలంలోని కొత్తపే ట గ్రామానికి చెందిన సింహరాజు నందం (48) బుధవారం వడదెబ్బతో మృతి చెందాడు. హుజూరాబాద్ రూరల్: మండలం లోని రాంపూర్ గ్రామంలో ఎర్ర మల్ల య్య (70) అనే వృద్ధుడు, బోర్నపల్లి గ్రామానికి చెందిన గరిజే రాజలింగం (75) అనే వద్ధుడు వడదెబ్బతో బుధ వారం మృతి చెందారు.
ఎల్కతుర్తి: మండల పరిధిలో వేర్వేరు గ్రామాల్లో వడదెబ్బ తగిలి ముగ్గురు మృతి చెందారు. గోపాల్పూ ర్కు చెందిన సబ్బిడి రాజేశ్వర్రావు (65) ఇంటి వద్ద పనులు చేస్తూ కుప్పకూలి చికిత్స అందించలోగానే మరణించాడు. సూరారంకు చెందిన బుగ్గ రాజయ్య (55) హుజూరాబా ద్లో మృత్యువాత పడ్డాడు. ఇవే కాకుండా కోతులనడుమలో ఎండ వే డిమిని తట్టుకోలేక గుర్తు తెలియని మతిస్థిమితం లేని వ్యక్తి చనిపో యా డు. అతని శవాన్ని పోలీసులు కననం చేశారు.
కమలాపూర్: కమలాపూర్ మం డలంలోని మర్రిపల్లిగూడెం గ్రామాని కి చెందిన మాసు రాజయ్య (55) అనే రైతు బుధవారం వడదెబ్బతో మృతి చెందాడు. మృతునికి భార్య, ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు.
వీణవంకః వీణవంకకు చెందిన కాడ మంచి గోపాల్ (50) బుధవారం వడ దెబ్బ కారణంగా చికిత్స పొందుతూ మృతి చెం దాడు. మృతుడికి భార్య. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
|
|
|