నామకరణానికి వెళ్లివస్తూ..
Viewed:
152
Times | News ID:
85026141
|
|
- Posted by
Ranadheer
on
5/26/2012 12:11:26 PM
in
Adilabad
,
Crime News
|
నామకరణానికి వెళ్లివస్తూ కడెం మండ లం దోస్తునగర్ గ్రామ వంతెన వద్ద గురువారం అర్ధరాత్రి లారీ ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ముగ్గు రు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఒకరు ఖానాపూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృ తిచెందారు. ఈ ప్రమాదంలో ఏడుగురు తీవ్రం గా గాయపడ్డారు. బంధువులు, పోలీసుల కథ నం.. జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన తుడుం మహేందర్‌కు కడెం మండలం ఆకొండపేట గ్రామానికి చెందిన లలితతో గతేడాది వివాహం జరిగింది. మొదటి సంతానంగా కొడుకు కావటంతో మహేందర్ అత్తగారి గ్రామమైన ఆకొండపేటలో గురువారం నామకరణోత్సవం(పురుడు) ఏర్పాటు చేశారు. ఈ పురుడు కు కవ్వాల్ నుంచి మహేందర్, ఆయన బంధువులు దాదాపు 35 మంది ట్రాక్టర్లో మధ్యాహ్నం బయలుదేరారు.
నామకరణోత్సవంలో పాల్గొని రాత్రి తొమ్మిది గంటలకు తిరుగుపయనమయ్యారు. రాత్రి పదకొండున్నర గంటల ప్రాంతంలో దోస్తునగర్ బ్రిడ్డి వద్దకు రాగానే కడెం నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న ఎరువుల లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీలో ప్రయాణిస్తున్న దుర్గం రాజేష్(24), తుడుం దేవేందర్(14), డొంగరి శేఖర్(10) అక్కడికక్కడే మృతి చెందారు. తుడుం మహేందర్, మురిమడుగు లింగవ్వ, దుర్గం నీల, తుడుం లక్ష్మి, తుడుం మహేశ్వరి, తుడుం నరేష్, దుర్గం మల్లేష్, తుడుం బద్దిరాజు (సంజీవ్)లకు తీవ్ర గాయాలు అయ్యాయి.
వీరిని వెంటనే ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదే అర్ధరాత్రి తుడుం మహేందర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగతా వారిని మెరుగైన వైద్యం కోసం మెట్‌పల్లికి తీసుకెళ్లారు. కాగా ప్రమాద స్థలాన్ని శుక్రవారం నిర్మల్ డీఎస్పీ శేషుకుమార్ సందర్శించారు. సీఐ వేణుగోపాల్, కడెం ఎస్సై సుధాకర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుడుం రాజన్న ఫిర్యాదు మేరకు లారీ డ్రైవరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఖానాపూ ర్ ప్రభుత్వాసుపత్రికి తరలించామని తెలిపాడు.
ఆవిరైన పుత్రోత్సాహం
జన్నారం మండలం కవ్వాల్కు చెందిన తుడుం రాజన్న, లక్ష్మిలకు ఒకే ఒక్క కుమారుడు మహేందర్. వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. మహేందర్‌కు కడెం మండలం ఆకొండపేటకు చెందిన లలితతో గతేడాది వివాహం జరిగింది. మహేందర్ కొడుకు పురుడు గురువారం నిర్వహించారు. పురుడు అనంతరం ఇంటికి తిరిగివస్తుండగా చోటు చేసుకున్న ప్రమాదంలో మహేందర్ మృత్యువాత పడ్డాడు. దీంతో ఆయన తల్లిదండ్రులు, భార్యాపిల్లల రో దనలు మిన్నంటాయి. వేడుకలు జరిగిన కొద్ది గంటల్లోనే ప్రమాదం చోటు చేసుకోవడంతో బంధువులు దుఃఖసాగరంలో మునిగారు. కవ్వాల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య లలిత రోదించిన తీరు కలిచివేసింది. వృద్ధాప్యంలో తమను ఎవరు చూసుకుంటారని తల్లిదండ్రులు విలపించిన తీరు కన్నీరు తెప్పించింది. 22 రోజుల చంటిపిల్లాడు తండ్రిలేని బిడ్డ అయ్యాడు.
చేతికొచ్చిన కొడుకు కానరాని లోకాలకు..
కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం రాజం, లక్ష్మి లకు రెండో సంతానం రాజేశ్. భద్రాచలంలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వేసవి సెలవులను సరదాగా గడపడానికి ఇంటి కి వచ్చాడు. బంధువుల శుభకార్యానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో చేతికందిన కొడుకు మృత్యువాత పడటంతో తల్లిదండ్రుల బాధ వర్ణణాతీతం. రాజేశ్‌కు అన్నయ్య అశోక్, చెల్లెలు జమున ఉన్నారు.
పదేళ్లకే నూరేళ్లు నిండాయి..
కవ్వాల గ్రామానికి చెందిన దుర్గం లింగన్న, రాజుల మూడో సంతానం శేఖర్. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాలుగో తరగతి పూర్తి చేశాడు. అందరితోపాటు శుభకార్యానికి నేను కూడా వస్తానని వెళ్లిన కుమారుడు శవం గా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. పదేళ్లకే నూరెళ్లు నిండాయా అని బంధువులు రోదించిన తీరు కలిచి వేసింది. శేఖర్‌కు అన్న, అక్క ఉన్నారు.
సెలవులకని వచ్చి శవమయ్యాడు..
సికింద్రాబాద్‌లో తన అన్నయ్య వద్ద ఉంటూ ఎనిమిదో తరగతి చదువుకుంటున్న తుడం దేవేందర్ సెలవుల కోసం తన స్వగ్రామానికి వచ్చి మృత్యువాత పడ్డాడు. తుడుం రాజ లింగం, జ్యోతి రెండో కుమారుడు దేవేందర్. ఈయనకు అన్న శైలందర్పాటు చెల్లెలు వనజ ఉన్నారు. దేవేందర్ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.
|
|
|