అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి
Viewed:
194
Times | News ID:
76115315
|
|
- Posted by
R.R Reddy
on
4/15/2011 3:45:56 PM
in
Medak
,
General News
|
(గజ్వేల్, ఏప్రిల్ 14) : అంబేద్కర్ 121వ జయంతి వేడుకలు మండల పరిధిలోని గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గురువారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బూర్గుపల్లి ప్రతాప్‌రెడ్డి, సీఐటీయూ, కేవీపీఎస్, డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, సీపీఎం, బీజేపీ, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మండల పరిధిలోని అనంతరావుపల్లి, కొండకండ్ల తదితర గ్రామాలలో అంబేద్కర్ సంఘాల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కార్యక్రమంలో సత్యలక్ష్మీ, రాములు, రామరాజు పంతులు, యాదగిరి, ఎల్లయ్య, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, కష్ణారెడ్డి, దేవేందర్, కళ్యాన్‌కర్ కిషన్, నర్సింగరావు, బెండ మధు, నర్సింలు, శ్రీనివాస్,కష్ణమూర్తి, యాదగిరి, సుభద్ర, అంజలి పాల్గొన్నారు.
ములుగులో...
డాక్టర్ బీ. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మండల కార్యాలయంలో ఆయన విగ్రహానికి గజ్వేల్ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పూలమాల వేసి జయంతి ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ సమసమాజ అభివృద్ధి కోసం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు.
కార్యక్రమంలో శ్రీనివాస్, నర్సింగరావు, బాలకృష్ణ, వెంకటేశ్, పోచయ్య, సయ్యద్‌సలీం, లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, సత్యనారాయణగౌడ్, రవిందర్‌రెడ్డి, యాదగిరి, గోపాల్, నర్సింలు, ఆంజనేయులు, శంకర్, భూపాల్‌రెడ్డి, సంజీవరెడ్డి, నర్సింహారెడ్డి, పోచయ్య, శ్రీనివాస్, శ్రవన్కుమార్పాల్గొన్నారు.
జగదేవ్‌పూర్‌లో...
అంబేద్కర్ ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు వంటేరు శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా జగదేవ్‌పూర్‌లోని అంబేద్కర్ విగ్రహానికి గురువారం పూలమాల వేసి నివాళులర్పించారు. వర్ధరాజ్‌పూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాయప్ప అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, నరేష్, శ్రీశైలం, కనకయ్య, స్వామి, చేబర్తి గ్రామంలో ఎమ్మార్పీఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, కనకయ్య, స్వామి పాల్గొన్నారు.
వర్గల్లో....
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వర్గల్‌లోని వేలూరు, తున్కిఖల్సాలో అంబేద్కర్ విగ్రహానికి గురువారం ఎమ్మార్పీఎస్, అంబేద్కర్ సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మోహన్, లక్ష్మీనారాయణ, కొండల్‌రెడ్డి, నాగభూషణం, లక్ష్మణ్, రాంచంద్రం, ఎస్ఐ లింగేశ్వర్, శివమల్లయ్య, జహంగీర్, పోచయ్య, శేఖర్, నాగరాజు, గణేష్, నర్సింగరావు, సాయికుమార్, యాదగిరి పాల్గొన్నారు.
దౌల్తాబాద్‌లో....
మండలంలోని దౌల్తాబాద్, దొమ్మాట, తిర్మలాపూర్, రాయపోల్ గ్రామాలలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివరాజ్, హనుక్, రామకృష్ణారెడ్డి, రణం శ్రీనివాస్‌గౌడ్, రాములు, శోభాభాస్కర్రెడ్డి, రాజాగౌడ్, సింహాచలం, నర్సింలు, లాలయ్య, దేవేందర్, సాయిలు, తుమ్మ శ్రీనివాస్, దశరథం, రమేష్, రాజేశ్, బాలకిషన్, నర్సింలు, రాజు, రాజు, స్వామి, చంద్రం, నర్ర సత్యం, చాంద్‌పాష, మహ్మద్, రాజాగౌడ్, సతీష్, శ్రీనివాసచారి పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలి...
తూప్రాన్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను నెరవేర్చినపుడే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లు భావించాలని ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. బ్రాహ్మణపల్లిలో గురువారంఅంబేద్కర్ విగ్రహావిష్కరణలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. అంబేద్కర్ ఆలోచనలు, విధానాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు. కార్యక్రమానికి కానుకుంట యాదగిరి అధ్యక్షత వహించారు.
కార్యక్రమంలో ఎం. భూంరెడ్డి, రాంమోహన్‌గౌడ్, కౌసల్య. సత్యనారాయణ పాల్గొన్నారు. మండలంలోని యావపూర్ చౌరస్తాలో యేడాది క్రితం ద్వంసం చేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరమ్మతులు చేశారు. గురువారం నర్సారెడ్డి దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శేరి నర్సింహ్మారెడ్డి, బొలంపల్లి బాబుల్‌రెడి పాల్గొన్నారు.
తూప్రాన్ పట్టణంలోని పెద్ద చెరువు కట్ట మరమ్మతు పనులను ఎమ్మెల్యే నర్సారెడ్డి పరిశీలించారు. ప్రొమొనియల్ ఆగ్రో కంపెనీ ఏర్పాటు చేసి మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఎనర్సారెడ్డి ప్రారంభించారు. పాముకాటుతో మరణించిన వెంకటరత్నాపూర్ గ్రామానికి చెందిన ఇలిటం కిష్టయ్య భార్య మల్లమ్మకు అపద్భాందువు పథకం కింద 50వేల చెక్కును ఆయన అందజేశారు.
|
|
|
|