పండగ పూట విషాదం
Viewed:
242
Times | News ID:
67922240
|
|
- Posted by
R.R Reddy
on
3/3/2011 12:10:49 PM
in
Karimnagar
,
Crime News
|
(మంథని, మార్చి 2 ): ని త్యం నిండుకుండలా ప్రశాంతంగా ఉం డే గోదారమ్మా మహా శివరాత్రి సందర్భంగా ఉగ్ర రూపం దాల్చింది. మం థని డివిజన్లో మహా శివరాత్రి వేడుక ల్లో అపశృతి చోటు చేసుకుంది. శివరా త్రి సందర్భంగా గోదావరి నదిలో పు ణ్య స్నానమాచరించేందుకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు నదీ ప్రవాహంలో బుధవారం గల్లంతయ్యా రు. పవిత్ర పుణ్య క్షేత్రమైన కాళేశ్వర న దీ తీరంలో ఒకరు, మంథని మండలం ఉప్పట్ల వద్ద ముగ్గురు, గుంజపుడుగు వద్ద ఒకరు గోదావరి నదీ ప్రవాహంలో పడి గల్లంతయ్యారు.
గుంజపడుగు వద్ద నీటి ప్రవాహం లో కొట్టుకు పోతున్న మరో విద్యార్థిని స్థానికులు రక్షించారు. ఉప్పట్ల గ్రామా నికి చెందిన కొంతం సాయికృష్ణ (16), బిరుదు సాయి (13), బిరుదు రాజు (15)లు గ్రామ శివారులోని గోదావరి నదీలో, గుంజపడుగు గ్రామానికి చెం దిన దయ్యాల సారయ్య (17), వందే ప్రశాంత్ (16) గ్రామ శివారులోని గో దావరి నదీలో, కాటారం మండల కేం ద్రానికి చెందిన తోట వంశీ (14) కాళేశ్వరం వద్ద గోదావరి నదీలో స్నానం చే స్తూ ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు.
వీరిలో వందే ప్రశాంత్‌ను స్థానికులు నీ టి ప్రవాహం నుంచి రక్షించారు. మి గితా ఐదుగురు గల్లంతు కాగా సాయం త్రం వరకు వారిలో బిరుదు సాయి, కొంతం సాయికృష్ణల మృతదేహాలు ల భ్యమయ్యాయి. మిగితా వారి కోసం గ జ ఈతగాళ్లు, సింగరేణి రేస్క్యూ టీం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
నదీ తీరంలో విద్యార్థుల కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రో దించడం పుణ్య స్నానాలాచరించడాని కి వచ్చిన భక్తులను సైతం ఈ సంఘటనలు కలిచి వేశాయి. మంథని సీఐ రా జేంద్రప్రసాద్, ఎస్ఐ సురేష్, తహసీల్దా ర్ వెంకట్‌రెడ్డిలు సంఘటన స్థలాలను సందర్శించి దర్యాప్తు చేయడంతో గా లింపు చర్యలు చేపట్టారు.
విద్యార్థుల గల్లంతు విచారకరం.. మంత్రి శ్రీధర్‌బాబు
గోదావరి నదీలో ఐదుగురు విద్యార్థులు గల్లంతవ్వడం విచారకరమని రా ష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆవేదన వెలిబుచ్చారు. బుధవారం మంత్రి శ్రీధర్‌బాబు తో ఫోన్లో మాట్లాడారు. ఉప్పట్ల ప్రమాద సమాచారం అందగానే పోలీస్, రెవెన్యూ, సింగరేణి అధికారులను సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించానన్నారు. ప్రభుత్వ ప రంగా మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
మేడిపల్లి ఓసీపీ శివారు గోదావరిలో ముగిని ఒకరు..
జ్యోతినగర్ : శివరాత్రి పర్వదినం ఆ రెండు కుటుంబాలలో తీవ్ర విషాదం నింపింది. బుధవారం పండగా పూట గోదావరి స్నానం కోసం ఇద్దరు విద్యార్థులు నదిలోనే మునిగిపోయారు. వీరి లో రామంచ రాజశేఖర్(22) అనే డిగ్రీ విద్యార్థి మృతి చెందగా కాసర్ల సంపత్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతయ్యా డు. వేరు వేరుగా జరిగిన ఈ దుర్ఘటనలకు సంబంధించిన వివరాలిలా ఉన్నా యి. ఎన్టీపీసీ భీమునిపట్నంకు చెందిన రామంచ రాజశేఖర్ తన కుటుంబ స భ్యులతో బుధవారం ఉదయం మేడి పల్లి ఓసీపీ శివారు సమీపంలోని గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. రా జశేఖర్ ముందుగా గోదావరి న దిలో దిగాడు.
ఒక్కసారిగా అతడు నీటిలో మునిగిపోయాడు. ఇది చూసిన కుటుం బ సభ్యులు అతన్ని బయటకు తీశారు. ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుండగానే రాజశేఖర్ మరణించాడు. కళ్ల ఎదుటే కొడుకు చనిపోవడంతో త ల్లిదండ్రుల రోధనకు అంతులేకుండా పోయింది. ఎన్టీపీసీ పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ఆ వరణ రోధనలతో నిండిపోయింది. కా గా, ఈ సంఘటన జరిగిన కొద్ది సేపటి కే స్థానిక పోరట్పల్లికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి కాసర్ల సంపత్ కనిపించకుండా పోయాడు.
సంపత్ తన మిత్రులతో కలిసి గోదావరి స్నానానికి వెళ్లా డు. స్నానం చేస్తూ నది లోపలికి వెళ్లి మునిగి ఉంటాడని మిత్రులు పోలీసులకు చెప్పారు. అతడి బట్టలు, చెప్పు లు నది ఒడ్డునే ఉండడంతో సంపత్ కూడా నదిలో గల్లంతయినట్లు అనుమానిస్తున్నారు. ఎన్టీపీసీ ఎస్ఐ ప్రసాదరావ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు జ రుగుతున్నాయి.
|
|
|