నేలరాలిన కమలం వనం ఝాన్సీరాణీ
Viewed:
238
Times | News ID:
58620193
|
|
- Posted by
R.R Reddy
on
2/21/2011 8:33:30 AM
in
Mahabubnagar
,
District News
|
అచ్చంపేట: కుటుంబ వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని బిజెపిలొ గ్రామ స్థాయి కార్యకర్త నుండి జాతీయ, రాష్ట్ర స్థాయికి ఎదిగిన కమలం నేత వనం ఝూన్సీ రాణి(42) లేరన్న విషయం అచ్చంపేట నియొజకవర్గంతొ పాటు రాష్ట్రంలొ దావానంలొ వ్యాపించడంతొ నల్లమల ప్రజలు శొకసంధ్రంలొ మునిగి పొయారు. శనివారం ఉదయం 6గంటల సమయంలొ అచ్చంపేట నుండి హైద్రాబాద్ బయలుదేరిన ఆమె జిల్లాలొని అమన్‌గల్ మండలం కడ్తాల్ సమీపంలొ 8గంటల సమయంలొ మృత్యువు రూపంలొ వచ్చిన రొడ్డు ప్రమాదంలొ ఆమె తీవ్రంగా గాయ పడ్డారు. వెంటనే మలక్పేటలొని కంచన్‌బాగ్ అపొలొ ఆస్ప త్రికి తరలించగా చికిత్స పొందుతూ చివరి శ్వాస వదిలినట్లు బందువులు తెలిపారు.
ఈ సంఘటనతొ అచ్చంపేట పట్ట ణంలొ వ్యాపార, వాణిజ్య విద్యాసంస్థలు స్వచ్చందంగా మూసి ఉంచారు. టిజెఎసి ఆద్వర్యంలొ నేతలు, పట్టణ ప్రజలు, పద్మశాలీలు, బిజేపికార్యకర్తలు అంబేద్కర్ చౌరస్తాలొ వనం ఝూన్సీరాణి చిత్రపటానికి పూలమాలలు వేసి నలజెండాలను ప్రదర్శించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. ఆమె పార్థివ దేహాన్ని బిజేపి రాష్టా పార్టీ కార్యాలయం నుండి రాత్రి వరకు అచ్చంపేటకు చేర్చి ఆది వారం అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుంటు భీకులు పేర్కొన్నారు.
కలెక్టరేట్లో..
తెలంగాణ వాది బిజెపి రాష్ర్ట కార్య వర్గ సభ్యురాలు వనం ఝాన్సి దుర దృష్టవశాత్తు శనివారం రోడ్డు ప్రమాదంలో మరణించడం జిల్లా ప్రజలకు తెలంగాణ ఉద్యమానిి తీరని లోటని ఆయన కన్నీరు పెట్టారు. ఆమె మరణం జిల్లా ప్రజలు తీవ్ర మన స్థాపానికి గురైన్నారు. ఆయన ఝాన్సి మరణంతో మనస్థాపం చెంది సంతాపాన్ని ప్రకటించారు.
షాద్‌నగర్‌లో...
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బిజెపి రాష్ట్ర నాయ కురాలు వనం ఝాన్సీరాణి మృతి సంఘటన పట్ల దిగ్భ్రాం తిని వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు చౌరస్తా వద్ద ఝా న్సీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించా రు. స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు మహేందర్ రెడ్డి ,కిష్ణా రెడ్డి,కాంగ్రెస్ ఎంపిటిసి సభ్యులు, జగన్ వర్గం నేత కోన దేవ య్య, బొబ్బిలి సుధాకర్‌రెడ్డిలు నివాళులు అర్పించారు.
కల్వకుర్తిలో..
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనం ఝాన్సీ రాణి శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కల్వకుర్తి, బిజెపి,ఏబివిపి,ఆర్ఎస్ఎస్,పద్మశాలి సంఘం,తెలంగాణ జెఏసి ,టిఎన్జిఓ నాయకుల ఆద్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి విద్యాసంస్థలను బంద్ పాటించారు. ప్రధా న చౌరస్తాలలో ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి ఘ నంగా నివాళ్లు అర్పించారు.ఈ కార్య్ర మంలో బిజెపి జిల్లా కార్యదర్శి పురం శేఖర్‌రెడ్డి, దళిత మోర్చ నాయకులు వెంక టయ్య,పుట్టశ్రీకాంత్, రణవీర్,ఏబివిపి రాష్ర్ట కార్యవర్గ సభ్యులు మల్లేష్‌యాదవ్, సందీప్, అంజి,ఆర్ఎస్ఎస్ నాయ కులు దయాకర్, సురేశ్‌గుప్త, ఆంజనేయులు, పద్మశాలి సంఘం నాయకులు బావండ్ల శ్రీనివాసులు,బావండ్ల వెంక టేశ్, చంద్రమౌళి, మాకం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
వంగూరులో...
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనం ఝాన్సీ మృతి చెందడం రాష్ట్రానికి,తెలంగాణ ప్రాంతానికి తీరని లోటని వంగూరు మండల జెఏసి కన్వీనర్ మంద రాజేందర్‌రెడ్డి అన్నారు.శనివారం ఝాన్సీ మరణ వార్త తెలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఝాన్సీ రాణితో విద్యార్థి దశ నుండి మంచిసంబంధాలు వుండేవని తన కు స్వంత అక్కలాంటిదని ఆయన అన్నారు.ఆమె స్పూర్తితోటే తెలంగాణ ఉద్యమంలో చూరుకైన పాత్ర పోషిస్తున్నానని ఆయన తెలిపారు.ఆమె మరణం తెలంగాణ వాదులకు తీరని లోటని ఆయన కన్నీటి పర్యంత మయ్యారు.
కడ్తాల్‌లో..
భారతీయ జనతాపార్టీ జాతీయ మహిళామోర్చ కార్యవర్గ సభ్యురాలు వనం ఝాన్సీ కడ్తాల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలియగానే స్థానిక బిజెపి నాయకులు ఆమె చిత్రపటాన్ని ప్రధాన రోడ్డుపై వుంచి వనం ఝాన్సీరాణి అమర్ రహే అంటు భారీ ర్యాలీ నిర్వహిం చారు.గ్రామంలో వాణిజ్య సముదాయాలు, హోటళ్లు ,సినిమాహాళ్లు స్వచ్చందగా మూసివేశారు. స్థానిక బిజెపి నాయకులు మోహన్‌రెడ్డి,దశరథ్‌నాయక్, యాదగిరి, జగత్‌రెడ్డి,శంతన్ తదితరులు పాల్గొన్నారు.
వెల్దండలో..
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బిజెపి అధికార ప్రతినిధి వనం ఝాన్సీకి మండల బిజెపి ఆద్వర్యంలో నల్లబ్యాడ్జీలు ధరించి ప్రధానకూడళీలలో ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగానివాళ్లు అర్పిం చారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్బంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ఈమె అకాల మరణంతో తెలంగాణకు బిజెపి పార్టీకి తీరని లోటని పలువురు కంటతడిపెట్టారు.ఈకార్యక్రమంలో బిజెపి మం డల అధ్యక్షులు కృష్ణారెడ్డి,సంతోష్,బాలస్వామి,శేఖర్‌రెడ్డి, కృష్ణయ్య,వేణు,పెద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
కల్వకుర్తిలో..
తబిజెపి మహిళా మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యురాలు వనం ఝాన్సీ రాణి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల టిడిపి ఎంపిటిసి సభ్యుడు బాలస్వామిగౌడ్ శనివారం ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు.వనం ఝాన్సీ రాణి తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుకైన పాత్ర పోషించిం దని ఆయన తెలిపారు.ఝాన్సీరాణి మారు మూల గ్రామం లో పుట్టి పెరిగి జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చు కుందని ఆయన కొనియాడారు.
ఆత్మకూర్‌లో..
ప్రజా స్వామిక ఉద్యమాల ద్యారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు తిరుపతి రెడ్డి, అరుణ్ కుమార్‌లు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం ఆత్మకూర్‌లోని వారి కార్యలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ధివాల కోరుతన్నాని ప్రజలు ఎండగొటాలన్నారు.
|
|
|