ఘనంగా కలమడుగు నారాయణస్వామి జాతర
Viewed:
223
Times | News ID:
572201838
|
|
- Posted by
R.R Reddy
on
2/21/2011 8:08:41 AM
in
Adilabad
,
General News
|
జన్నారం: మండలంలోని కలమడుగు గ్రామంలో నారాయణ స్వామి జాతర ఘనంగా జరిగింది. ప్రతీ ఏటా రెండు రోజుల పాటు జరిగే ఈ జాతరకు జన్నారం మండలంతో పాటు పక్క మండలమైన కడెం, కరీంనగర్ జిల్లా ఖమ్మునూరు, మంగెల, రాయికల్ గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు చేరుకొని నారాయణ స్వామిని దర్శించుకుంటారు. జాతర ఉదయం 8గంటల నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది.భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ కమిటీ అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఈనెల 17నుంచి ప్రారంభమైన జాతర 19తేది రాత్రి గ్రామాల్లోని ప్రధాన వీధుల గుండా ప్రత్యేక రథంతో ఊరేగింపు నిర్వహించి అనంతరం జాతర ముగుస్తుంది. ఈ మూడు రోజుల పాటు జరిగిన జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేశారు. అగ్గిమల్లన్న జాతర కూడా ఇదే విధంగా జరుగుతుందన్నారు.
|
|
|