'తెలంగాణ'దీక్షలు ప్రారంభం..
Viewed:
245
Times | News ID:
4312203
|
|
- Posted by
R.R Reddy
on
1/22/2011 1:33:54 PM
in
Adilabad
,
Political News
|
మంచిర్యాల, జనవరి 21 : మంచిర్యాల పట్టణంలోని జేఏసీ శిబిరం వద్ద శుక్రవారం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకై రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. మొదట జేఏసీ నాయకులు గోనె శ్యాం సుందర్రావు, తులా మధుసూదన్, గురిజాల రవీందర్రావు, జగన్మోహన్రావు, మున్నారాజ్ సిసోడియా, పెద్దపెల్లి పురుషోత్తం, జాఫర్, బాబన్న, నైనాల వెంకటేశ్వర్లు, కళాకారులు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అమరవీరుల స్తూపానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జేఏసీ నాయకులకు, టీఆర్ఎస్ నాయకులకు మధ్య కొద్ది సేపు నూతన జేఏసీ నిర్మాణం వంటి అంశాలపై చర్చ జరిగింది.
చివరకు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా కార్మిక, కర్షక, విద్య, వైద్య, న్యాయవాద, విద్యార్థి, జర్నలిస్టు, ఉద్యోగ సంఘాలతో పాటు వివిధ కుల సంఘాల నాయకులు దీక్షలో పాల్గొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ నిరసన వ్యక్తం చేశారు. ఉద్యమంలో పాల్గొనండి ఎమ్మెల్యే నల్లాల ఓదెలు జైపూర్: తెలంగాణ ప్రాంతంలోని నాయకులారా.. ఇప్పటికైనా తెలంగా ణ ఉద్యమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే నల్లాల ఓదెలు డిమాండ్ చేశారు. శుక్రవారం మండలంలో రిలే నిరాహార దీక్షలను ప్రారంభించిన ఆయన రాష్ట్ర ఏర్పాటును కాంక్షిస్తున్న తెలంగాణ వాసుల ఓట్లతో గెలిచి పదవులను పట్టు కు వేలాడుతున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా తమ పదవులకు రాజీనా మా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉద్యమంలో పాల్గొని చరిత్రలో నిల్చిపోవడమో... రాజీనామా లు చేయక పదవులను పట్టుకువేలాడితే చరిత్రలో తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతారని ఆయన హెచ్చరించారు. ఆయనతో పాటు మండల జేఏసీ కన్వీనర్ గద్దల హన్మంతు, టీఆర్ఎస్ మండల ఇన్చార్జి కటుకూరి సత్యనారాయణ, జేఏసీ కో-కన్వీనర్ మెండె సత్యనారాయణ, దాసరి మధునయ్య, జాగ టి రాజయ్య, శీలం వెంకటేశం, మం తెన వెంకటేశ్‌గౌడ్ తదితరులు కార్య క్రమంలో పాల్గొన్నారు.
కాగా జైపూర్ మండల కేంద్రంలో, భీమారం గ్రామం లో దీక్షా శిబిరారాలను ప్రారంభించారు. ఇందారం గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు పెద్దపల్లి రమేశ్, నామాల తిరుపతి, తయ్యబ్, చిప్పకుర్తి వెంకటన్నల ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. తెలంగాణ తోనే అభివృద్ధి మందమర్రి: ప్రత్యేక రాష్ట్రంతోనే తెలంగాణ అభివృద్ది సాధ్యమని ఎమ్మెల్యే నల్లాల ఓదెలు అన్నారు. పట్టణంలోని హైదరాబాద్-నాగ్‌పూర్ రాష్ట్రీయ రహదారి ప్రక్కన జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాశ్వత దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. తెలంగాణకై చేపట్టిన దీక్షాకారుల మెడలో దండలు వేసి దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలిదశ ఉద్యమంలో భాగంగా చేపట్టిన దీక్షలు రాష్ట్రాన్ని సాధించేంత వరకు కొనసాగించాలన్నారు.
అంతకుముందు అమరుల చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్, కో కన్వీనర్లు పోలు శ్రీనివాస్, ఈశ్వర్, హెచ్ రవీందర్, సుందిల్ల రాజయ్య, కుంబు ల్, డాక్టర్ సదానందం, పోశం తదితరులు పాల్గొన్నారు. దండె పల్లిలో... దండెపల్లి: తెలంగాణ బిల్లును పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కోరుతూ దండెపల్లిలో శుక్రవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలో కూర్చున్న వారిలో మండల టీ ఆర్ఎస్ అధ్యక్షుడు చీర్ల వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సందెల తిరుపతి, మండల అధికార ప్రతినిధి గుండ రవీందర్, దండెపల్లి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కట్ట వెంకటేష్, రాంపెల్లి రమేష్, టీఆర్ఎస్ యువజన సంఘం నాయకులు గడికొప్పుల సురేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పిట్టల రాజన్న, మండల కార్యదర్శి మర్రిపెల్లి వెంకటేష్‌లు ఉన్నారు.
లక్షెట్టిపేటలో... లక్షెట్టిపేట: తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు స్థానిక ఊత్కూర్ చౌరస్తా వద్ద మండల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రిలే నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటయింది. మొదటి రోజు దీక్షల జేఏసీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసిన అనంతరం దీక్షలో కూర్చున్నారు. దీక్షలో కూర్చున్న వారిలో జేఏసీ నాయకులు నైనాల గోవర్ధణ్, చిప్పకుర్తి నారాయణయ, తోట శంకర మ్మ, బిరుదుల ధర్మయ్య, ప్రేం సాగర్, రమేష్, ఏసురత్నం, రేగుంట రమేష్ తదితరులు ఉన్నారు. రామకృష్ణాపూర్లో... రామకృష్ణాపూర్: ప్రత్యేక రాష్ట్ర సాధనకై తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు శుక్రవారం రామకృష్ణాపూర్ పట్టణంలో రిలే దీక్షలను చెన్నూర్ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతు తెలంగాణ రాష్ట్రం ఏర్పాట య్యే వరకు దీక్షలు కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఇంచార్జి కె సురేందర్‌రావు, టీబీజీకేఎస్ నాయకులు బైరిమల్ల మొగిలయ్య, శంకర్, సదానందం, టీఆర్ఎస్వి నా యకులు వినోద్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. చెన్నూర్‌లో... చెన్నూర్: తెలంగాణ రాష్ట్రం సాధిం చే వరకు పోరాటం ఆపేది లేదని టీఆర్ ఎస్ తూర్పు జిల్లా అ«ధ్యక్షుడు పురాణం సతీష్ కుమార్ అన్నారు. శుక్రవారం జేఏసీ ఆ«ధ్వర్యంలో చెన్నూర్‌లో దీక్షల ను ఆయన ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
మొదటి రోజు జరిగిన దీక్షల్లో నాయకులు, ముదిరాజ్ సంఘం నాయకులు సాధనబోయిన కృష్ణ, అట్టెం సంతోష్, బానయ్య, రాజబాపు, తుమ్మ రాజం, సింగారపు మల్ల య్య, గెరెల్లి మల్లయ్య, ననిమెల మల్ల య్య, విల్లారమ్మలు కూర్చున్నారు. ఈ దీక్షలో కూర్చున్న వారికి జేఏసీ కన్వీనర్ నారాయణరెడ్డి, జడ్పీటీసీ కరుణాసాగర్‌రావు, కాంగ్రెస్ నాయకులు రేగళ్ల మధుసూదన్, రేగల్ల విజయానంద్, పీఆర్టీయూ జిల్లా నాయకులు మైదం రవి, టీఆర్ఎస్ నాయకుడు దామోదర్ రెడ్డి, అయ్యూబ్, ప్రభాకర్ రెడ్డి, వెంకట్రాజం, జేఏసీ నాయకులు రత్న సత్యనారాయణ రెడ్డి, కోరళ్ల శ్యాంసుందర్ రెడ్డిలతో చెన్నూర్ బార్ అ సోసియేషన్ నాయకులు రమేష్ చందర్ గిల్డా, మల్లికార్జున్, మల్లేష్, కార్తిక్, రాంబావ్లు విధులు బహిష్కరించి సంఘీభావం తెలిపారు. కోటపల్లిలో... కోటపల్లి: తెలంగాణ రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కోటపల్లిలోని తెలంగాణ చౌక్‌లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ తూర్పు జిల్లా అధ్యక్షుడు పురాణం సతీష్‌కుమార్, మండల జేఏ సీ కన్వీనర్ కామబాపులు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు.
జేఏసీ నాయకులు సుందిళ్ల వెంకటి, జీవన్, శ్యాం సుందర్, వెంకటేష్, ప్రభాకర్, ఆనంద్‌రావు, శ్రీనివాస్, సుందర్‌లు రిలే దీక్ష లో కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పి సాంబాగౌడ్, గుర్ర రాజన్న, శేగం చంద్రయ్య, న్యాయవాది రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
|
|
|
|