తెలంగాణ రాష్ట్రం బీజేపీతోనే సాధ్యం
Viewed:
226
Times | News ID:
40220349
|
|
- Posted by
R.R Reddy
on
1/20/2011 5:19:16 PM
in
Nizamabad
,
Political News
|
కామారెడ్డి, జనవరి 19 : తెలంగాణ రాష్ట్రం బీజేపీతోనే సాధ్యమని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం కామారెడ్డిలో వరలక్ష్మీగార్డెన్లో జరిగిన బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన సమ్మేళన సదస్సుకు విశిష్ట అతిథిగా హాజరై మాట్లాడారు. నిజామాబాద్ జిల్లా ఢిల్లీ పెద్దలకు దిమ్మ తిరిగేటట్లు చేశారని ఆయన గుర్తు చేశారు. రెండు సార్లు పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను ఓడించిన ఘనత జిల్లా ప్రజలదేనన్నారు
. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో తెలంగాణ రాదని బీజేపీ ముందే చెప్పిందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేపట్టనున్న రచ్చబండ కార్యక్రమాన్ని ప్రతీ గ్రామం లో తెలంగాణవాదులు బహిష్కరించి నిలదీయాలన్నారు. గతంలో నిర్వహించిన ప్రజాపథంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఏ విధంగా వచ్చారని నిలదీయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని కప్పిపుచ్చుతూ కేంద్రానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారని అన్నారు. గవర్నర్ నర్సింహాన్ రాజ్యంగాన్ని విస్మరించి సోనియాగాంధీ సేవ చేస్తున్నాడని అన్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు తెలంగాణను మోసం చేస్తున్నాయని అన్నారు.
తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చుకుందాం - పెద్దోళ్ల గంగారెడ్డి
తెలంగాణ ప్రజలు గత 56 యేళ్లుగా తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేసి గ్రామాలకు నాయకులను రానివ్వకుండా అడ్డుకుంటెనే తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చుకుంటామన్నారు. పార్లమెంటులో బిల్లు పెడితేనే తెలంగాణ సాధ్యం
- ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ తెలంగాణ రావాలంటే శీతాకాల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టేలాగా తెలంగాణ కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమవుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ అన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ కామారెడ్డిలో తెలంగాణ యువజన సదస్సు బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్ అండ్ బీ అతిథి గృహం నుంచి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు జిల్లా బీజేపీ అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణలతో కలిసి బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అర్కల ప్రభాకర్‌యాదవ్ ఆధ్వర్యంలో అశోక్‌నగర్‌లోని వరలక్ష్మి గార్డెన్స్ వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు.
బీజేవైఎంలో చేరిన వివిధ మండలాల నాయకులు కామారెడ్డి డివిజన్లోని భిక్కనూరు తలమడ్ల, దోమకొండ, కామారెడ్డి, మండలాలకు చెందిన 200 మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేవైఎంలో చేరారు.
|
|
|