పారా మిలటరీ బలగాల గుప్పిట నగరం
Viewed:
329
Times | News ID:
307241937
|
|
- Posted by
R.R Reddy
on
12/25/2010 9:07:55 AM
in
Hyderabad
,
District News
|
శ్రీకృష్ణ కమిటీ ఈనెల 31న తన ని వేదికను సమర్పించనున్న నేపథ్యంలో తరువాత జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయోనని భావిస్తున్న పో లీసు ఉన్నతాధికారులు నగరాన్ని ఖాకీవనంగా మార్చేస్తున్నారు. నగర పో లీసు విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి అదనంగా కేంద్ర పారా మిలటరీ బలగాలను రప్పిస్తున్నారు. ఇప్పటికే 14 కంపెనీల కేంద్ర బలగాలు నగరానికి చేరుకున్నాయి. పని కూడా మొదలుపెట్టాయి. మరోవైపు రాయిట్ కం ట్రోల్ టీంలను తయారు చేస్తున్నారు. ఇంకోవైపు పోలీస్‌స్టేషన్ వారీగా ప్ర త్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నా రు. స్పెషల్ టాస్క్‌ఫోర్స్, స్ట్రయికింగ్ ఫోర్స్ టీంలను సిద్ధం చేస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం తీసుకుంటు న్న ముందుజాగ్రత్త చర్య ఇదని పో లీసు అధికారులు చెబుతున్నారు.
ఉద్యమంతో... ప్రత్యేక తెలంగాణ ఉద్యమంతో హై దరాబాద్ కొన్నినెలలుగా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. ఉస్మాని యా విశ్వవిద్యాలయం దీనికి కేంద్ర బిందువుగా ఉండగా నిజాం కాలేజీ...సికింద్రాబాద్ పీజీ కాలేజీ...సైఫాబాద్ పీజీ కాలేజీ...సిటీ కాలేజీ విద్యార్థులు చురుకుగా ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు. తెలంగాణవాదులతో తరచూ గన్‌పార్క్ కిటకిటలాడుతోంది. ఈ క్రమంలో పలుమార్లు ఉద్యమకారులు...పోలీసుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. పరస్పరం రాళ్లు రువ్వుకోవటాలు...లాఠీఛార్జీలు...భాష్పవాయువు గోళాల ప్రయోగం...రబ్బరు బుల్లెట్లతో కాల్పులతో పలుమా ర్లు ఉస్మానియా వర్శిటీ అట్టుడికి పో యింది.
నగరంలోని వేర్వేరుచోట్ల ఆ ర్టీసీ, ప్రయివేట్ బస్సులతోపాటు వ్యా పార, వాణిజ్య సంస్థలపై దాడులు జరిగాయి. ఇటువంటి పరిస్థితుల్లో డిసెంబరు 31వ తేదీ తరువాత ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు ప్రకటించా రు. ఆఖ్రీ మౌకా...ఏక్ ఔర్ ధక్కా అని పిలుపునిచ్చిన ఆయన ప్రత్యేక రా ష్ట్రాన్ని సాధించటానికి దేనికైనా సిద్ధం గా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న వేర్వేరు ప్రజాసంఘాలు కూడా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ప్రకటించాయి.
ఈ నేపథ్యంలోనే... ఈ నేపథ్యంలోనే డిసెంబరు 31వ తేదీ తరువాత శాంతిభద్రతల సమస్య లు ఉత్పన్నం కాగలవని ఇటు ప్రభు త్వం అటు పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పారా మి లటరీ బలగాలను పంపాలని అభ్యర్థిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిం ది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభు త్వం యాభై కంపెనీల సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలను రా ష్ట్రానికి పంపించటానికి అంగీకరించిం ది. వీటిలో పద్దెనిమిది కంపెనీలను ఒ క్క హైదరాబాద్‌కే కేటాయించారు. దీంట్లో పది సీఆర్పీఎఫ్, ఆరు సీఐఎస్ఎఫ్, రెండు బీఎస్ఎఫ్ కంపెనీలు ఉం టాయి. పోలీసువర్గాలు చెబుతున్న ప్రకారం ఒక్కో కంపెనీలో వందమంది సిబ్బంది ఉంటారు. ఇప్పటికే 14 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలు నగరానికి చేరుకున్నాయి కూడా. నగర పోలీసు విభాగంలో పనిచేస్తున్న ఎనిమిదివేలమంది సిబ్బందికి వీళ్లు అదనంగా విధులు నిర్వర్తించనున్నారు.
రాయిట్ కంట్రోల్ టీమ్స్... దీనికి అదనంగా రాయిట్ కంట్రోల్ టీమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆర్మ్డ్ రిజర్వ్ విభాగంలో పనిచేస్తున్న వా రిలో మెరికల్లాంటి యువకులతో ఈ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒ క్కో టీంలో ఇరవై అయిదుమంది ఉం టారని పోలీసు ఉన్నతాధికారులు చె బుతున్నారు. అత్యవసర పరిస్థితి తలెత్తినపుడు వీళ్లు రంగంలోకి దిగుతారన్నారు. పరిస్థితిని అదుపులోకి తెస్తారని చెప్పారు. ప్రస్తుతం ఈ బృందాల్లోని సిబ్బందికి పాతబస్తీ పెట్లబుర్జులోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్డ్ హెడ్‌క్వార్టర్స్‌లో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు.
స్టేషన్ వారీగా... వీరితోపాటు ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొత్తగా రిక్రూట్ అయిన యువ సబ్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో ఈ టీం లు పనిచేస్తాయి. ఒక్కో బృందంలో యువకులైన పదిమంది సిబ్బంది ఉం టారు. స్టేషన్ పరిధిలో ఎక్కడ సమ స్య తలెత్తినా అప్పటికే రంగంలో ఉండే కేంద్ర పారామిలటరీ బలగాలు, సిటీ పోలీసులకు తోడుగా ఈ టీములు వెళ్లి పనిచేస్తాయి. ఇక, స్పెషల్ టాస్క్‌ఫోర్స్ బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు.
వీటిపైనే... పోలీసు ఉన్నతాధికారులు ప్రధానం గా ఉస్మానియా యూనివర్శిటీ, గన్‌పార్క్, నిజాం కాలేజీ, సికింద్రాబాద్ పీజీ కాలేజీ, సైఫాబాద్ పీజీ కాలేజీలతోపాటు మాణికేశ్వర్‌నగర్, తార్నాక ప్రాంతాలపై దృష్టిని సారించారు. ఉద్య మ తీవ్రత ఎక్కువగా ఈ ప్రాంతాల్లోనే ఉందని చెప్పిన ఓ సీనియర్ పోలీసు అధికారి బందోబస్తు ఏర్పాట్లు ఈ చోట్ల నే పటిష్టంగా ఉండబోతున్నాయన్నా రు. పోలీసులు నిగ్రహంతో వ్యవహరిస్తారని...అయితే సమస్యలు సృష్టించాలనుకుంటే మాత్రం కఠినంగా వ్యవహరిస్తారన్నారు.
|
|
|