హ్యాకర్లున్నారు జాగ్రత్త..!
Viewed:
186
Times | News ID:
302028155
|
|
- Posted by
Ranadheer
on
8/28/2012 12:25:57 PM
in
Nizamabad
,
Crime News
|
నిజామాబాద్ డెస్క్: ఉదయం లేవగానే కంప్యూటర్ ఆన్‌చేసి సోషల్ వెబ్సైట్లలో సైన్ఇన్ అవ్వడ ం నెటిజన్ల హాబీ. ముఖ్యంగా యువత ఆ రోజు చేయబోయే దినచర్యలను పోస్టింగ్ చేయడం, మొబైల్లో ఫొటోలను బంధించి షేర్ చేయడంతోనే వారి లైఫ్ బిజీగా మారిపోతుంది. కొంత మంది మరో అడుగు ముందుకు వేసి వ్యక్తిగత విషయాలనూ నెట్‌వర్క్‌లలో పంచుకుంటున్నారు. అపరిచిత వ్యక్తులతోనూ స్నేహం పెంచుకుంటున్నారు.
తగు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అనుకోని ముప్పు తెచ్చి పెట్టుకుంటున్నారు. సోషల్ నెట్‌వర్క్‌లు ఇస్తున్న వెసులుబాట్లు కొందరి జీవితాలనే మార్చేస్తున్నాయి. ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి వెబ్సైట్లలో అపరిచిత వ్యక్తులు చొచ్చుకువచ్చి మరీ పోస్టింగ్ చేస్తున్నా రు. ఇది సమాజానికి ఉపయోగకరమైందైతే ఫర్వాలేదు. కానీ బూతు పురాణా లు, అసభ్యకరమైన మెసేజ్‌లే అధికం గా ఉంటుండటంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. సోషల్ నెట్‌వర్క్‌లు కాస్తా దారి తప్పుతున్నాయి. వెబ్సైట్ల లో జరుగుతున్న సైబర్‌క్రైం నిరోధించేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నా లు పెద్దగా ఫలించ డం లేదు.
స్నేహానికి అవధులు లేవు.. కానీ..
స్నేహమేరా జీవి తం... కొన్ని సందర్భాలలో అయిన వారి కన్నా స్నేహితులే ఆదుకుంటారని అంటారు. ఇది కొందరి విషయంలో మాత్రమేనని నెటిజన్లు ముందుగా గుర్తించాలి. ఛాటింగ్, సోషల్ వెబ్సైట్లలో కొత్తగా పరిచయాలు పెరగడం, సర్కిల్ ఏర్పడం సర్వసాధారణంగా మారింది. అవే కొన్ని సందర్భాలలో సమస్యలను సృష్టిస్తాయి. ఉదాహరణకు ఓ ఐటీ ఉద్యోగిని భర్తను కోల్పోయి కుమారుడితో ఉంటో ంది. ఫేస్బుక్లో అపరిచిత వ్యక్తితో పరిచయం ఏర్పడింది. రోజు ఛాటింగ్ చేసుకునే వారు. ఓ సారి అవతలి వ్యక్తి కోరి న మేరకు తన ఫొటోను పోస్టింగ్ చేసిం ది. కొద్ది రోజుల తరువాత ఆమె మీద ఫేస్బుక్లో మరో అకౌంట్ రూపొందినట్టు తెలుసుకుంది. అందులో ఆమె ఫొటో పెట్టి వేశ్య అని రాసి ఉండటంతో నిశ్చేష్టురాలైంది. విషయాన్ని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైకోర్టు ను ఆశ్రయించింది.
చొరబాటు ఎలా...?
సా«ధారణంగా ఫేస్బుక్, ట్విట్టర్, లింక్లిండ్ లాంటి సోషల్ వెబ్సైట్లలో సభ్యులుగా చేరగానే కొన్ని సర్కిల్లు ఫ్రెండ్షిప్ కోసం రిక్వెస్ట్ పంపిస్తాయి. వీటిల్లో మనకు తెలిసిన వారైతే ఓకే చేయవచ్చు. అపరిచిత వ్యక్తులతో పరిచయమే అసలు సిసలైన ఇబ్బందులు తెచ్చిపెడతాయి. అపరిచిత వ్యక్తితో స్నేహం చేయడానికి ఒప్పుకుంటామో అప్పుడే మన గురించి పూర్తి వివరాలు తెలిసిపోతాయి. వీటిని అసరాగా చేసుకొని కొంత మంది అకౌంట్లు ప్రారంభించి అసభ్యకరమైన సమాచారాలను పోస్టింగ్ చేస్తున్నారు. ఫేస్బుక్లో కొత్తగా ఒకరి అకౌంట్ నుంచి మరొకరి అకౌంట్లోకి వెళ్లి పోస్టింగ్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. దీన్ని వల్ల మనకు తెలియకుండానే మన అకౌంట్ లో మరొకరి పోస్టింగ్‌లు దర్శనమిస్తా యి. దీంతో సైబర్‌క్రైం మరింత పెరిగిపోయింది.
ఇలా చేస్తే మేలు..
జరుగుతున్న చొరబాట్లపై సోషల్ వెబ్సైట్లను నింధించడం కంటే మనమే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అకౌంట్లోకి లాగిన్ అయ్యాక కొన్ని నిమిషాలు జాగ్రత్తలపై దృష్టి సారిస్తే చొరబాట్లను నిరోధించవచ్చు. సభ్యత్వంలో లాగిన్ అయ్యాక హోమ్ దగ్గరకు మౌస్ క్రసర్ను తీసుకువెళ్లగానే రెండు అఫ్షన్స్ కనిపిస్తాయి అకౌంట్ సెట్టింగ్, ప్రైవసీ సెట్టింగ్ అని ఉంటాయి. ఇందులో ప్రైవెసీ సెట్టింగ్‌ను ఎంచుకునే మీరు పొందుపరుస్తున్న సమాచారాన్ని పబ్లిక్ లేదా మిత్రులా లేదా కుటుంబ సభ్యులా అనే ఆప్షన్ ఎంచుకుంటే చాలు మిగతా వారికి ఏమీ కనిపించదు. మీకు ఫలానా వ్యక్తి వద్ద నుంచి పోస్టింగ్‌లు రావద్దని అనుకుంటే ఆ మెసేజ్ వద్ద క్లిక్ చేసి పోస్టింగ్ వద్దు అనే అప్షన్ ఎంచుకుంటే చాలు ఇక వారి వద్ద నుంచి ఎటువంటి పోస్టింగ్‌లు రావు.
మరికొన్ని జాగ్రత్తలు..
ం మీరు స్నేహం చేయబోయే వ్యక్తుల గురించి క్షుణ్నంగా తెలుసుకోండి. అతని ప్రొఫైల్‌పై ఆరా తీయండి.
ం మీ గురించి ఎంత తక్కువ సమాచారం పెడితే అంత మంచిది.
ం మీ మిత్రుల లిస్టులో నుంచి మీ కొచ్చే అభ్యర్థనలు, నోటిఫికేషన్లను ఆపే యండి.
ం మీరు ఇంటర్నెట్ వాడేటప్పుడు అది పూర్తిగా సురక్షితమైందా? కాదా అనేది నిర్ధారించుకోవాలి. కొంత మంది హ్యాక ర్లు మీ అకౌంట్ వివరాలను, పాస్‌వర్డ్‌లను పొందేందుకు సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేసే ప్రమాదం ఉంది.
ం ఎప్పటికప్పుడు సెక్యూరిటీ సెట్టింగ్స్ ను గమనించుకుంటూ ఉండాలి.
ం మారుపేరుతో సభ్యత్వం పొందడం వల్ల అపరిచిత వ్యక్తుల బెడద తప్పుతుంది.
ం ఎప్పటికప్పుడు ఫిల్టర్లను ఉపయోగిస్తూ పనికిరాని మెసేజ్‌లను తీసివేయాలి.
|
|
|