మమ్మల్నెవరు చూసుకోవాలమ్మా..
Viewed:
138
Times | News ID:
300328057
|
|
- Posted by
Ranadheer
on
8/28/2012 11:27:38 AM
in
Karimnagar
,
Crime News
|
ధర్మారం రూరల్ : మమ్మల్నెవరు చూసుకోవాలమ్మా.. మాకన్నం ఎవరు పెడతర మ్మా.. కూలీ పన్జేస్తూ బాగా సదువుకోవాలని డబ్బులిస్తివి కదమ్మా.. మేమెట్ల బతుకాలే అమ్మా... అంటూ రోదిస్తూ తలకొరివి పెట్టిన ఆడపిల్లలను చూసిన మనసున్న ప్రతి ఒక్కరిని కలిచి వేసింది. ఈ సంఘటన ధర్మారం మండలం బొట్లవనపర్తిలో సోమవారం జరిగింది. గ్రామంలోని దళిత కాలనీకి చెందిన బెక్కం లచ్చయ్య-లక్ష్మి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు.
రాణి(17) కరీం నగర్లోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. రవళి(13) మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. రెండేళ్ల క్రితం వ్యవసాయ పనులకు వెళ్లిన లచ్చయ్య వడదెబ్బతో మృతి చెం దాడు. అప్పటి నుంచి లక్ష్మి(40) ఇద్దరు కూతుళ్లకు అన్నీ తానై కూలీ పనులు చేస్తూ చదివించుకుంటోంది. పది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న లక్ష్మిని రెండురోజుల క్రితం పిల్లలు బంధువుల సహకారంతో మంచిర్యాలలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి లక్ష్మి సోమవారం మృతి చెందింది. తల్లికి చిన్న కూతురు రవళి తలకొరివి పెట్టింది.
|
|
|