వైఎస్ఆర్ సీపీలోకి భారీ వలసలు
Viewed:
153
Times | News ID:
291423238
|
|
- Posted by
Ranadheer
on
8/23/2012 1:08:11 PM
in
Mahabubnagar
,
Political News
|
హైదరాబాద్: జిల్లాలోని కొల్లాపూర్, జడ్చర్ల నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నేతలు, వందలాది మంది కార్యకర్తలు బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొల్లాపూర్ నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి సి.జగదీశ్వర్‌రావు, ఆ పార్టీ మరోనేత, న్యాయవాది హర్షవర్దన్‌రెడ్డి, జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన తంగిరాల నాగిరెడ్డిలతో పాటు భారీఎత్తున తరలొచ్చిన మాజీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, వారి అనుయాయులు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యనాయకుల సమక్షంలో పార్టీలో చేరారు. వారికి సీజీసీ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి, సీనియర్‌నేత సజ్జల రామకృష్ణారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పాలమూరు జిల్లా అభ్యున్నతికి దివంగత వైఎస్. రాజశేఖరరెడ్డి చేసిన సేవలను గుర్తించి పార్టీలో చేరినందుకు అభినందనలు తెలిపారు. కరువు జిల్లాను సస్యశ్యామలం చేయాలని తపించి నాలుగు ఎత్తిపోతల పథకాలకు వైఎస్ఆర్ శ్రీకారం చుట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
అనంతరం పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తూ, వైఎస్ హయంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత పాలకుల విధానాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. తమ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సీపీని బలమైన రాజకీయశక్తిగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే జడ్చర్లకు చెందిన ఏబీవీపీ రాష్ట్ర శాఖ మాజీ నాయకుడు తంగిరాల నాగిరెడ్డి ఆధ్వర్యంలో వచ్చిన నాయకులు, అనుచరులు సైతం పార్టీలో చేరారు. అనంతరం విజయమ్మను కలుసుకున్నారు.
వీరి వెంట పార్టీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి, సీజీసీ సభ్యురాలు బాలమణెమ్మ, సీఈసీ సభ్యులు రావుల రవీంద్రనాథ్‌రెడ్డి, జిల్లా కో-ఆర్డినేటర్ బండారు మోహన్‌రెడ్డి తదితరులున్నారు. పార్టీలో చేరిన వారిలో పీఎఫ్ అసిస్టెంట్ మాజీ కమిషనర్ పి.బాలయ్య, టీడీపీ జిల్లా నేతలు చెన్నయ్య, విజయ భాస్కర్‌రెడ్డి, మధుసూదన్‌గుప్త, మహేష్, గిరిధర్, శ్యాంసుందర్‌రెడ్డి, ఎంఎం.రెడ్డి, ప్రకాష్ తదితరులు ఉన్నారు.
|
|
|