పెట్రోల్ బంక్ సీజ్
Viewed:
146
Times | News ID:
290023136
|
|
- Posted by
Ranadheer
on
8/23/2012 12:06:37 PM
in
Hyderabad
,
Crime News
|
హస్తినాపురం: కల్తీ డీజిల్ విక్రయిస్తున్న పెట్రోల్ బంకును బుధవారం రాత్రి సివిల్సప్లై అధికారులు సీజ్ చేశారు. హస్తినాపురం చౌరస్తాలోని శ్రీ బాలాజీ కైలాస్ ఫిల్లింగ్ స్టేషన్లో రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ఛైర్మన్ నోముల రాంరెడ్డి తన కారులో బుధవారం ఉదయం డీజిల్ పోయించుకున్నారు. అనంతరం రాంరెడ్డి గచ్చిబౌలికి వెళ్లారు.
మార్గమధ్యలో కారులో సమస్యలు తలెత్తడంతో మెకానిక్‌ను సంప్రదించగా అతను పరిశీలించి కిరోసిన్ కలిసిన డీజిల్ వల్ల ఇంజిన్‌లో సమస్య తలెత్తిందని చెప్పాడు. దీంతో రాంరెడ్డి సివిల్సప్లై అధికారులకు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన సివిల్సప్లై అధికారులు ఏఎస్వో మోహన్‌బాబు, ఇన్స్పెక్టర్ నరేందర్‌రెడ్డి బంకు వద్దకు వచ్చి పరిశీలించి డీజిల్ పంపును సీజ్ చేశారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారులు వచ్చిన తరువాత శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తామని అధికారులు తెలిపారు.
|
|
|