సీటు మారని వేతన మాయగాడు
Viewed:
155
Times | News ID:
289322250
|
|
- Posted by
Ranadheer
on
8/22/2012 1:20:15 PM
in
Nizamabad
,
Crime News
|
కామారెడ్డి మున్సిపాలిటీలో కార్మికులు పనిచేయకుండానే చేసినట్లు హా జరు పట్టిక తయారుచేసి నెలకు లక్ష లు మింగేస్తున్న ఒక ఉద్యోగి వైనం వెలుగులోకి తెచ్చింది. వివిధ ఏరియాలలో కార్మికులు పనిచేసినట్లు చూపించి దర్జాగా జీతాలు మింగేశారు. కాగితాల్లో పారిశుధ్యం, వీధుల్లో అపరిశుభ్రం పెరిగి జనం రో గాల భారినపడ్డారు. ఈ ఉదంతం వె లుగుచూసి కొన్ని నెలలు గడిచినా ఇ ప్పటి వరకు మాత్రం బొక్కిన ఉద్యో గి సీటు మాత్రం మారలేదు.
మున్సిపాలిటీ అంటేనే చెత్త అం టుంటారు. అందులోనూ శానిటేషన్ విభాగమంటే పక్కా చెత్తపని చేసే ది.. సూర్యోదయానికి ముందే విధుల్లోకి చేరే కార్మికులు ఊరువాడా క్లీన్ చేసేస్తారు. చెత్తా చెదారం ఎత్తేస్తారు. మురికి కాలువలు శుభ్రపరుస్తారు. ఇది అందరికి కనిపించే శానిటేషన్ వి భాగం పనితీరు.దీని వెనుక ఇంత కంటే చెత్త పనులు, మరీ చెత్త ఆలోచనలు దాగున్నాయంటే నమ్ముతారా? కేవలం ఈ కార్మికులు సాక్షిగా లక్షలా ది రూపాయలు మింగేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రీజన ల్ జాయింట్ డైరెక్టర్ స్థాయిలో విచారణ చేసిన వీసమెత్తు మార్పులేదు. ఎందుకిలా..? అక్రమాలకు అధికారు ల అండ వెనుక మతలబేమిటి..?
కామారెడ్డి మున్సిపాల్ శానిటరీ విభాగంలో కొంత కాలంగా పారిశు ధ్య కార్మికుల అటెండెన్సు పేరిట లక్షలాది రూపాయలు దిగమింగుతున్నా రు. విధులకు గైర్హాజరవుతున్న కార్మికులకు అటెండెన్సు వేస్తు, తద్వారా వచ్చే భత్యాన్ని విభాగం బాధ్యులు కాజేస్తున్నారు. సగటున నెలకు లక్ష పై చిలుకు, ఏడాదిలో 15 లక్షల వర కు రూపంలో అధికారుల జేబుల్లోకి వెళ్తోంది. కార్యాలయంలోని అటెండె న్సు రిజిష్టరులో కార్మికులకు గైర్హాజ రు వేసి ఉండగా, వేతనాల కోసం పంపిన జాబితాల్లో మాత్రం పూర్తి హాజరు వేసిన విషయం ఇటీవల ము న్సిపాల్ ఆర్జేడీ దృష్టికి వెళ్ళింది.
కా మారెడ్డి మున్సిపాల్లోని శానిటరీ వి భాగంలో 40 మంది రెగ్యూలర్, 152 మంది కాంట్రాక్టు కార్మికులున్నారు. రెగ్యూలర్ కార్మికుల్లో ఒక్కొక్కరికి నెలకు రూ.15 వేల నుంచి 18 వేల వరకు వేతనం ఉంటుంది. కా గా, కాంట్రాక్టు కార్మికులకు నెలకు రూ.6,900 ఆందజేస్తున్నారు. వారం తా ప్రతీరోజు ఉదయం అయిదు గం టలకు శానిటరీ కార్యాలయంలో హా జరు ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చిన వా రికి అటెండెన్సు వేసి ఏ ప్రాంతంలో పని చేయాలో నిర్దేశిస్తారు. రెగ్యూల ర్ కార్మికులు విధులకు హాజరు కాని పక్షంలో నిబంధనల ప్రకారం సెల వు పెట్టుకోవాల్సి ఉంటుంది.
లేని పక్షంలో అబ్సెంట్ వేసి వేతనంలో కో త విధించాల్సి వస్తుంది. కానీ, కామారెడ్డి మున్సిపాల్ అధికారులు దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. శానిటేషన్ విభాగం చూసుకునే బాధ్యులు అటెండెన్సు వ్యవహారంలో చక్రం తి ప్పుతున్నారు. శానిటేషన్ కార్యాలయంలో ఉండే రిజిష్టరులో విధులకు రాని వారికి సిన్సియర్‌గా అబ్సెంట్ వేస్తున్న వారు వేతనాల కోసం ట్రేజరీ కి పంపే జాబితాలో మాత్రం పూర్తి హాజరు వేస్తున్నారు. ఆంధ్రజ్యోతి సే కరించిన రిజిష్టరు పట్టిక ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కా ర్యాలయంలో రిజిష్టరులో సమోదైన వివరాల ప్రకారం.. మార్చిలో 40 మందిలో ఒక్కరు కూడా 31 రోజుల పాటు పని చేయలేదు.
ప్రతీ ఒక్కరు ఏదో ఒక రోజు విధులకు గైర్హాజయ్యారు. కొందరు హాఫ్‌డే పని చేయగా, మరికొందరు అసలు విధులకే రాలేదు. అలాంటి వారందరికి అబ్సెంట్ వేసి ఉంది. ఇందులో పి.కె.రమేష్ అనే కార్మికుడు 11 రోజు లు, గుర్జాల రాజయ్య అనే కార్మికుడు 9 రోజులు, సుంకరి లక్ష్మి అనే కార్మికురాలు8 రోజులు, ప్రకాష్ అనే వ్యక్తి 8 రోజులు గైర్హాజరైనట్లు నమోదైంది. మిగతా వారు రెండు, మూడు రో జుల నుంచి ఏడు రోజుల వరకు వి ధులకు హాజరు కాలేదు. ఇవి రిజిష్టరులో ప్రత్యక్షంగా కనిపిస్తున్న ఆధారాలు. అయితే, ఇదే నెలకు సంబంధించిన వేతనాల కోసం ట్రెజరీకి పం పిన జాబితాలో వీరందరూ 31 రోజు లు పని చేసినట్లు నమోదు చేశారు.
ఒక్కరు కూడా, ఒక్క రోజైనా గైర్హాజ రు కాలేదని, అందరూ అన్ని రోజు లూ పని చేశారని అధికారులు ధ్రువీ కరించారు. ఈ మేరకు శానిటరీ విభా గం బాధ్యడు అతీక్ అహ్మద్ సంతకం చేసి మరీ అధికారిక ఆమోదానికి పం పారు. వాస్తవానికి ఈవేతన జాబితా ను మున్సిపల్ కమిషనర్ మేనేజర్ ప రిశీలించి, సంతకం చేసి ఆమోద ము ద్ర వేయాల్సి ఉంటుంది. కానీ, ఆం ధ్రజ్యోతి చేతికి క్కిన జాబితాలో వారి సంతకాలు లేకుండా, కేవలం ఇన్ ఛా ర్జీ అతీక్ సంతకంతోనే వేతనాలు జా రీ అయ్యాయి. ఈ ఒక్క నెలలోనే 40 మంది రెగ్యూలర్ కార్మికులకు సం బంధించిన గైర్హాజరీల సంఖ్య 114 రోజులు. సగటున ఒక్కో ఉద్యోగికి రో జుకు 400 భత్యం లెక్కేసినా అందరి కి కలిపి సుమారు 50 వేల రూపాయ లు అక్రమంగా పొందినట్లుగా స్పష్టమవుతోంది. దీంతో పాటు 152 మం ది కాంట్రాక్టు కార్మికుల్లో ఇలాంటివి 300కు పైగానే ఉన్నాయి. వాటిని కూడా కలిపితే ఒక్క నెలలోనే లక్షా 20వేల వరకు నొక్కేసినట్లు తెలుస్తోం ది. ఇలా ఒక ఏడాదిలో 15 లక్షల వ రకు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నాయి. అడ్డదారిలో అటెండెన్సు పొందిన కార్మికులు వేతనం తమ బ్యాంకు ఖాతాల్లోకి రాగానే అందులోని వాటాను సదరు విభాగం బా «ధ్యుడికి అందిస్తున్నారు. ఈ మేరకు కార్మికులతో ముందస్తు ఒప్పందాలున్నాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో ఇది ఆనవాయితీగా వస్తోంది.
దీనికి తోడు 40 మంది రెగ్యులర్ కార్మికుల్లో 19 మంది బినామీలతో ప నులు చేయిస్తున్నారు. వారు ఇళ్ళల్లో ఉంటూ, ఇతర పనులు చేసుకుంటూ బినామీ వ్యక్తులను పనికి పంపుతున్నారు. బదిలీ పేరిట సాగే ఈ తం తులో అసలు కార్మికుడు పూర్తి వేత నం పొందుతూ, బినామీకి ఎంతో కొంత భత్యం అందజేస్తున్నారు. వీరి నే అసలు కాంట్రాక్టు కార్మికుల జాబితాలో చూపుతూ అధికారులు డబుల్ రాబడి పొందుతున్నారు. ఉదాహరణ కు, అన్నెపల్లి ఎంకవ్వ అనే రెగ్యూల ర్ కార్మికురాలి స్థానంలో స్వరూపఅ నే బినామీ పని చేస్తోంది.
జి.నర్సవ్వ ప్లేస్‌లో భిక్షపతి, చుక్కరాజు బదులులక్షీ, చిలక రాజయ్య బదులు నవీన్, బాలస్వామి స్థానంలో రాజా, సుంచు పోచయ్య బదులు ప్రభాకర్, పెద్ద రా జయ్య బదులు గంగవ్వ, గురిజాల రాజయ్య బదులు రమేష్.. ఇలా మొ త్తం మీద 19 మంది బినామీ కార్మికు లు కొనసాగుతున్నారు. దీనికి తోడు కొందరు కార్మికులు పట్టణంలోని ప్ర జాప్రతినిధులు, వివిధ పార్టీలకు చెం దిన నాయకుల ఇళ్లలో పని చేస్తున్నా రు. ఎమ్మెల్యే గంప గోవర్దన్ వాహనానికి డ్రైవర్‌గా పని చేసే వ్యక్తి ఈ శానిటేషన్ విభాగం నుంచి వేతనం పొం దుతున్నాడు. మరో కార్మికురాలు ఆ యన ఇంటి పనులు చక్కబెడుతుంటారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ము న్సిపల్ మాజీచైర్మన్ కైలాస్ శ్రీనివాస్ ఇంట్లో హంసవ్వ గిన్నెలు కడుగుతుంటుంది. టీఆర్ఎస్ నాయకుడు ముజిబొద్దిన్ వద్ద ఇద్దరు కార్మికులు సేవ చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఆయ న నివాసంలో కె.లక్ష్మి, కామారెడ్డిలో ని ఆయన తమ్ముడి నివాసంలో సావి త్రి పని చేస్తున్నారు.
టీడీపీకి చెందిన నిట్టు వేణుగోపాల్ ఇంట్లో అన్నేపల్లి విజయ పనిచేస్తుండగా, ఎం.శ్రీనివా స్ అనే కార్మికుడు ఆయన వాహనం డ్రైవరుగా కొనసాగుతున్నాడు. బీజేపి కి చెందిన మోతే కృష్ణాగౌడ్ ఇంట్లో జంగి నర్సవ్య పనులు చేస్తోంది. పట్ట ణ ప్రజల సేవలు మరచిన వీరందరి కి ప్రజాధనాన్ని మాత్రం అప్పనంగా పంచి పెడుతున్నారు. ఇలాంటివి ఇ క్కడ సర్వసాధారణ విషయమని, అ ధికారి చేయి తడిపితే ఏదైనా సాధ్యమని కార్మికులు బహిరంగంగానే చె బుతున్నారు. సుధాకర్ అనే కాంట్రా క్టు కార్మికుడు ఇది నిజమని చెప్పాడు.
ఇందంతా ఇక్కడ బహింరంగ రహస్యమే..!
ఉన్నతాధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదనేగా మీ అనుమా నం..? కామారెడ్డి నుంచి హైదరాబా ద్ వరకు దశల వారీగా వాటాలున్నా యి. కాగా, శానిటేషన్ విభాగంలోనే ఈ అక్రమాలు ఆర్జేడీ పరిశీలనకు వెళ్లాయి. దీనిపై సమగ్ర విచారణ జ రిపి నివేధిక పంపాలని ఆయన నేరు గా కామారెడ్డి మున్సిపల్ ఇన్చార్జీ క మిషనర్ సుధాకర్‌రెడ్డికి, కామారెడ్డి ఆర్డీవో వెంకటేశ్వర్లుకు లేఖలు పంపా రు. వారు కొద్దిరోజుల పాటు ఆకస్మిక తనిఖీలు, కార్మికులతో వ్యక్తిగత విచారణల పేరిట హంగామా చేశారు. రే యింబవళ్లు పట్టణంలో పర్యటించి కార్మికుల పనితీరును పర్యవేక్షించా రు. తమ స్థాయిలో నివేదికను కూడా పంపారు. కానీ, చర్యలే అటకెక్కా యి. ఈ అక్రమాలపై కామారెడ్డి మొ త్తంకోడై కూస్తుండగా, అధికార యంత్రాంగంలో ఎలాంటి చలనం లే కపోవడం గమనార్హం.
తీరా తేలిందేమిటంటే.. సదరు వి భాగం తరపున విచారణాధికాలకు రూ.50 వేల చొప్పున హైదరాబాద్‌కు రూ.లక్ష వరకు మామూళ్లు ముట్టాయట. హైదరాబాద్‌లో అధికారుల తో కామారెడ్డికి చెందిన కాంగ్రెస్ ము ఖ్య నాయకుడి రాయబేరాలు, ప్రజా ప్రతినిధుల అండదండలు లేకపోలేద ని ఆరోపణలు వస్తున్నాయి.
|
|
|