246 మంది ‘నిషా’చరులకు కౌన్సెలింగ్
Viewed:
158
Times | News ID:
287722143
|
|
- Posted by
Ranadheer
on
8/22/2012 12:13:06 PM
in
Hyderabad
,
Crime News
|
సిటీబ్యూరో: మద్యం తాగి వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్లో పట్టుబడిన 246 మంది వాహనచోదకులకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు నగర అదనపు కమిషనర్ (ట్రాఫిక్) సీవీ ఆనంద్ తెలిపారు. శుక్ర-శనివారాల్లో రాత్రి 10 - ఒంటి గంట మధ్య నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన డ్రైవ్లో వీరు చిక్కినట్లు తెలిపారు. పట్టుబడిన వారిలో 170 ద్విచక్ర, 66 తేలికపాటి వాహనాలతో పాటు 10 ఆటోలు ఉన్నాయని ఆనంద్ తెలిపారు.
వీరి వాహనాలు స్వాధీనం చేసుకున్నామని, చోదకులను మంగళవారాల్లో కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి బీసీ రాయుడు రూ. 2,500 వేల చొప్పున జరిమానా విధించారని పేర్కొన్నారు. దీనికి ముందు ఈ ‘నిషా’చరులకు గోషామహల్, బేగంపేట్ల్లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో కౌన్సెలింగ్ చేశామన్నారు. ఈసారి చిక్కిన వారిలో అనేక మంది ప్రముఖులు, వారి సంబంధీకులు ఉన్నట్లు సమాచారం.
|
|
|