బోనకల్లో విద్యావలంటీర్ ఆత్మహత్య
Viewed:
130
Times | News ID:
28492139
|
|
- Posted by
Ranadheer
on
8/21/2012 1:39:56 PM
in
Khammam
,
Crime News
|
బోనకల్:ఉన్నత చదువులకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని మనస్తాపానికి మండల కేంద్రంలో సోమవారం ఓ విద్యావలంటీర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. బోనకల్‌కు చెందిన గంగుల నాగేశ్వరరావు, నాగేం ద్రమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుం టూ జీవిస్తున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఇంటి వద్దే ఉంటోంది. వికలాంగురాలైన రెండో కుమార్తె దుర్గ(22) స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యావలంటీర్‌గా పనిచేస్తోంది. మూడో కుమార్తె స్కూల్‌కు వెళ్తోంది. బీఎస్సీ బీఈడీ పూర్తి చేసిన దుర్గ ఉన్నత చదువుల కోసం ఆదివారం రాత్రి తండ్రిని డబ్బులు అడిగింది.
ఈ విషయంపై కుటుంబ సభ్యులు మధ్య గొడవ జరిగింది. రాత్రి అంతా మామూలుగానే ఉన్నారు. సోమవా రం ఉదయం ఎవరి పనులకు వారు వెళ్లారు. అప్పటికే మనస్తాపానికి గురైన దుర్గ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కుమార్తె మృతి చెంది ఉండడంతో చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. తన వల్లే కు మార్తె ఆత్మహత్య చేసుకుందని, తానుకూడా చనిపోతానంటూ తండ్రి నాగేశ్వరరావు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం కు టుంబ సభ్యులు ఇంట్లో కుమార్తె మృతదేహాన్ని ఉంచి తండ్రి ఆచూకీ వెతకగా బంధువుల ఇంట్లో ఉన్నాడు. గ్రామ సేవకుడు షేక్ ఉద్దండు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పెద్దిరెడ్డి రామకృష్ణారావు తెలిపారు.
|
|
|