శ్రీనివాస్‌కు కన్నీటి వీడ్కోలు
Viewed:
154
Times | News ID:
28081873
|
|
- Posted by
Ranadheer
on
8/18/2012 5:33:44 PM
in
Karimnagar
,
General News
|
కోల్‌సిటీ: ‘ఎంత పనిచేసినవ్ కొడుకా... పరాయి దేశంపోయి పాణం పోగొట్టుకుంటివా బిడ్డా... అమెరికాలో మంచిగ బతుకుతన్నంటివి... అందర్ని సూడాలన్పిస్తందంటివి... ఏడికి పోతివి సీనయ్యా... దేవుడా నా బిడ్డను అన్యాయంగా పొట్టనపెట్టుకుంటివా...’ అంటూ రావికంటి శ్రీనివాస్ తల్లిదండ్రులు భూమయ్య-చంద్రకళ గుండెలవిసేలా రోదించారు. అమెరికాలోని ఒక్లహోమా నగరంలో ఈ నెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖనికి చెందిన రావికంటి శ్రీనివాస్ మరణించిన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన ఎనిమిది రోజుల తర్వాత అమెరికా నుంచి మృతదేహం శుక్రవారం స్థానిక లక్ష్మీనగర్‌కు చేరింది. దీంతో ఒక్కసారిగా కుటుంబసభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటారుు.
సాఫ్ట్‌వేర్‌గా వెళ్లి.. విగతజీవుడై..
స్థానిక జనగామ గ్రామానికి చెందిన రావికంటి భూమయ్య-చంద్రకళ దంపతులకు రాజేశ్, శ్రీనివాస్, సతీశ్, ప్రశాంత్ కుమారులు. సింగరేణి సంస్థ ఆర్జీ-1 జీఎం కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసి రిటైర్డ్ అయిన భూమయ్య కష్టపడి కొడుకులను చదివించాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్ చదివిన శ్రీనివాస్ ఏడాదిన్నరగా అమెరికాలోని ఒక్లహోమా నగరంలో ఉంటున్నాడు. పెద్ద కొడుకు రాజేశ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా బెంగళూర్‌లో జాబ్ చేస్తున్నాడు. మిగతా ఇద్దరు కొడుకులు హైదరాబాద్‌లోనే చదువుతుండడంతో తల్లిదండ్రులు వారితో కలిసి ఉంటున్నారు. ఈ నెల 8న చివరిసారిగా అందరితో మాట్లాడి ఒక్కసారి చూడాలని ఉందన్నాడు. డిసెంబర్లో వస్తానని, వెళ్లేప్పుడు అమ్మ, తమ్ముడిని తీసుకెళ్తానని చెప్పాడు. ఈ నెల 10న నలుగురు మిత్రులతో కలిసి హోటల్లో భోజనం చేయడానికి కారులో వెళ్తుండగా.. ఒక్లహోమా నగర సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వారితోపాటు శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందాడు.
ఎనిమిది రోజుల తర్వాత మృతదేహాలు
ఎనిమిది రోజులపాటు మృతదేహం కోసం శ్రీనివాస్ కుటుంబసభ్యులు ఎదురుచూశారు. ఇంటర్నెట్ ద్వారా మృతదేహాలు ఎప్పుడు ఇండియాకు వస్తున్నాయో సమాచారం కోసం ఆశతో నిద్రలేని రాత్రులు గడిపారు.
అమెరికా నుంచి విమానంలో ఐదు మృతదేహాలు శుక్రవారం హైదరాబాద్ చేరుకున్నాయి. శ్రీనివాస్ మృతదేహాన్ని సోదరుడు రాజేశ్, బంధువులు గోదావరిఖనికి తరలించారు. ముఖం, చేతులపై గాయాలు కనిపిస్తున్నా మృతదేహం చెడిపోకుం డా ఉండడంతో కుటుంబ స భ్యులు, బంధువులకు శ్రీనివాస్‌ను చూసే అవకాశం దక్కింది. స్థానిక గోదావరినది సమీపంలో దహన సంస్కారాలు పూర్తిచేశారు.
|
|
|