వైద్యం వికటించి పసికందు మృతి
Viewed:
280
Times | News ID:
26812450
|
|
- Posted by
R.R Reddy
on
12/12/2010 6:20:16 PM
in
Rangareddy
,
Crime News
|
మేడ్చల్ రూరల్: వైద్యం వికటించి నాలుగు రోజుల పసికందు మృత్యువాత పడటంతో బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా దౌల్తాబాద్ గ్రామానికి చెందిన పుల్గరి తులసి ఈ నెల 6 న మేడ్చల్ మండలంలోని ఘనాపూర్ గ్రామ పరిధిలోని మెడిసిటి ఆసుపత్రిలో డెలివరి కొసం చేరింది. ఆమెకు 8 న సిజేరిన్ ఆపరేషన్ చేయడంతో బాబు జన్మించాడు. కాగా 10 న ఉదయం 11 గంటలకు ఆ చిన్నారికి బీసీజీ వ్యాధి నిరోధక టీకాను ఇచ్చారు. అప్పటి నుంచి కన్నులు పూత పడిన బాబు సాయంత్రం వరకు ఏడవటం కాని, పాలు తాగడం గాని చేయలేదు. దీంతో అక్కడే ఉన్న నర్సులకు విషయాన్ని తెలిపారు.
దీంతో నర్సులు బాబుకు ఇంజెక్షన్ ఇచ్చారు కదా ! పరువాలేదు అలాగే ఉంటుంది, ప్రమాదం ఏమి లేదని జవాబిచ్చారే తప్ప పరీక్షించి చూడలేదన్నారు. రాత్రికి కూడా అలాగే ఉండగా.. ఎంత చెప్పినా నర్సులు, డాక్టర్లు ఎవరు వచ్చి చూసిన పాపాన పోలేదన్నారు. కాగా శనివారం ఉద యం 4 గంటలకు బాబుని చూడటంతో ఎలాంటి చలనం లేకపోవడంతో నర్సులకు తెలుపగా హడావుడిగా బాబు ఇంక్యుబేటర్ వార్డులోకి తీసుకెళ్లారు. గంట తర్వాత వచ్చి మీ బాబు చనిపోయాడని తెలియజేశారు. దీంతో వైద్యుల నిర్లక్ష్యంతోనే బాబు చనిపోయాడని బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న మేడ్చల్ సీఐ యాదగిరిరెడ్డి అక్కడికి చేరుకొని సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. దీంతో బంధువులు పోలీస్‌స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదుచేయలేదు.
సంతోషం నాలుగు రోజులే..
15 సంవత్సరాల క్రితం వివాహం జరిగింద ని, ఇప్పటి వరకు తమకు పిల్లలు లేక ఇబ్బం దులుపడుతున్నామని మొదటిసారిగా బాబు జన్మించడంతో సంతోషపడ్డామని తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యంతో ఈ సంతోషం నాలుగురోజులే మిగిలిందని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్ఎంఓ డాక్టర్ నర్సింగ్‌రావు వివరణ
పసికందు మరణించడంలో వైద్యుల నిర్లక్ష్యం ఏ మాత్రం లేదని మెడిసిటి ఆసుపత్రి ఆర్ఎంఓ నర్సింగ్‌రావు తెలిపారు. నాలుగురోజుల చిన్నారి కావడంతో పాలు ఎక్కువగా తాగడం వల్ల అవి ముక్కులోకి రావడంతో మరణించి ఉండవచ్చన్నారు.
|
|
|