లభించని విద్యార్థుల ఆచూకీ
Viewed:
146
Times | News ID:
265228247
|
|
- Posted by
Ranadheer
on
7/28/2012 1:17:56 PM
in
Adilabad
,
Crime News
|
కాగజ్నగర్ రూరల్, జూలై 27 : కాగజ్నగర్ మండలం నజృల్నగర్కు చెందిన నలుగురు విద్యార్థులు పెద్దవాగులో గల్లంతై నాలుగు రోజులు గడుస్తున్నా ఆ చూకీ లభించలేదు. దీంతో అటు తల్లితండ్రులతో పాటు గ్రామస్తుల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నా లుగు రోజులుగా ఎడ తెరిపి లేకుం డా కురుస్తున్న వర్షాలకు పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పెద్దవాగు నీరు ప్రాణహిత నదిలో కలుస్తున్నాయి.
రెవెన్యూ సిబ్బందితో పాటు ఈసుగాం ఎస్ఐ సత్యనారాయ ణ, రూరల్ ఎస్ఐ తిరుపతిలు పోలీసు సిబ్బంది, నజృల్నగర్కు చెందిన 13 గ్రామాల ప్రజలు జట్లుగా విడిపోయి గల్లంతైన ప్రదేశం నుంచి ప్రాణహిత నది తీరం వరకు ముమ్మరంగా గాలిం పు చర్యలు చేపడుతున్నారు. నాలుగు రోజులుగా విద్యార్థుల ఆచూకీ లభించక పోవడంతో విద్యార్థుల తల్లితండ్రులు, వారి బంధువులు అన్న పానియాలు మాని రోధిస్తూ ఎదురు చూస్తున్నారు.
రంగంలోకి సింగరేణి రెస్క్యూ టీం : గల్లంతైన విద్యార్థుల ఆచూకీ లభించక పోవడంతో అధికారులు శుక్రవారం మందమర్రి సింగరేణికి చెందిన వాటర్ అండ్ మైన్స్ రెస్క్యూ మూర్తి బృందంతో గాలింపు చర్యలు చేపట్టారు. ప్రవాహం అధికంగా ఉండడం, నీటి ఉధృతి తగ్గక పోవడంతో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గాలింపు చర్యలు చేపట్టినా ఆ చూకీ లభించలేదు.
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ : పెద్దవాగులో గల్లంతైన నలుగురు వి ద్యార్థుల కుటుంబ సభ్యులను శుక్రవా రం ఎంపీ రాథోడ్ రమేష్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుచ్చిలింగంలు పరామర్శించారు. ఈ సందర్భంగా సంఘటన జరిగిన తీరును వారి నుంచి అడిగి తెలుసుకుని సానుభూతి వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆచూకీ త్వరగా లభించేలా అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టేలా కృషి చేస్తానని తెలిపారు.
సహయక చర్యలు చేపడుతున్న మాజీ ఎమ్మెల్యేలు : కొంత మంది కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, పాల్వాయి రాజ్యలక్ష్మి నది పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ గాలింపు చర్యలు చేపడు తూ గల్లంతైన విద్యార్థుల కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతున్నారు. అలాగే నజృల్నగర్ నుంచి బెజ్జూరు శివారు వరకు పెద్దవాగు పరిసర గ్రామాల్లో ఉన్న కార్యకర్తలకు సమాచారం అందించి విద్యార్థుల ఆచూకీ కోసం ప్రయత్నించాలని, ఆచూకీ లభించిన పక్షంలో వెంటనే తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.
|
|
|