బంగారం వ్యాపారి మోసంపై విచారణ
Viewed:
141
Times | News ID:
256114319
|
|
- Posted by
Ranadheer
on
7/14/2012 1:49:11 PM
in
Warangal
,
Crime News
|
ఏటూరునాగారం, జూలై 13 : కోటి రూపాయలతో ఉడాయించిన బంగారం వ్యాపారి లింగం లక్ష్మీనారాయణ ఉదంతంపై స్థానిక ఎస్సై ఎన్.వెంకటేశ్వర్లు విచారణ చేపట్టారు. మండల కేంద్రంలోని శ్రీనారాయణస్వామి జ్యూయలర్స్ షాపు యాజమా ని అయిన లక్ష్మీనారాయణ బంగారం అభరణాలతో పాటు, ప్రైవేటు చిట్టివ్యాపారంతో కోటి రూపాయలకు పైగా ప్ర జల వద్ద నుంచి వసూలుచేసి ఉడాయించిన విషయం విదితమే. విచారణ లో భాగంగా శుక్రవారం షాపు తెరిపిం చి అందులోఉన్న షాపునకు సంబంధించిన లైసెన్స్‌లు, లావాదేవీల బుక్కుల ను ఎస్సై స్వాధీనం చేసుకున్నారు. షాపులోని లాకర్, ఇతర బీరువాలను నిందితుడి భార్య మనోజ ఎదుట క్షు ణ్ణంగా తనిఖీ చేశారు. అయితే షాపు లో బంగారంకానీ, నగలుకానీ లభించలేదు. ఈవిషయం తెలుసుకున్న బాధితులు హుటాహుటిన బంగారం షాపువద్దకు చేరుకొని తాము ఇచ్చిన నగదు, బంగారు అభరణాల వివరాలను ఎస్సై దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై స్పందించిన ఎస్సై బాధితులకు న్యా యం జరిగేలా కృషి చేస్తానని వివరించారు. బాధితుల గోడు... ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. వరంగల్‌కు చెందిన జ్యూవెల్లరీ షాపు యాజమాని బిల్ల వీరస్వామి మాట్లాడుతూ లింగం లక్ష్మీనారాయణ కొద్ది రోజుల్లో డబ్బులు ఇస్తానని నమ్మబలికి తన వద్దనుంచి 22తులాల బం గారాన్ని అరువు తీసుకున్నాడని తెలిపాడు. రెండు రోజులక్రితం పారిపోయిన విషయం తెలుసుకొని న్యాయం చేయాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. రైతు వలస మొండయ్య మాట్లాడు తూ చిట్టీ వ్యాపారం పేరుతో నమ్మబలికి రూ.40వేలు నా నుంచి వసూలు చేశాడు. డ్రా తగులుతుందనే ఆశతో సభ్యుడిగా చేరాను. ఇప్పుడు లక్ష్మీనారాయణ పరారీ కావడంతో నా పరిస్థితి ఏ మిటో అర్ధం కావడం లేదు. నాకు న్యాయం చేయాలి' అని కోరాడు. పం డ్ల వ్యాపారి ఉచిత శ్రీను మాట్లాడుతూ 'లక్ష్మీనారాయణకు ఏడు తులాల బంగారం, నగల తయారీకి లక్ష రూపాయల నగదు ఇచ్చాను. తీసుకున్న రెం డురోజులకే పారిపోయాడు..' అని వివరించాడు. కూరగాయల వ్యాపారి మానగాని రాజు మాట్లాడుతూ 'చిట్టీ వ్యాపారం లో డబ్బులు కలిసి వస్తాయనే ఆశతో మా ఎదురుగా ఉన్న షాపు యాజమా ని లక్ష్మీనారాయణకు రూ.12వేలు చె ల్లించి స్కీంలో సభ్యుడిగా చేరాను. ఇ ప్పుడు ఆయన అడ్రస్ లేకుండా ఉడాయించాడు. పోలీసులు చొరవ తీసుకొ ని న్యాయంచేయాలి..' అని కోరాడు.
|
|
|