శ్రీనివాస్‌కు ‘ఇంటర్నేషనల్ లయనిజమ్’ అవార్డు
Viewed:
141
Times | News ID:
245312152
|
|
- Posted by
Ranadheer
on
7/12/2012 12:22:06 PM
in
Karimnagar
,
District News
|
వేములవాడ: సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుటున్న లయన్స్ క్లబ్ కరీంనగర్ మాజీ చైర్మన్ గోగికార్ శ్రీనివాస్‌కు అత్యుత్తమ ‘ఇంటర్నేషనల్ అప్రిషియేషన్ అవార్డు’ను లయన్స్‌క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ డెరైక్టర్ సునీల్‌కుమార్, జిల్లా గవర్నర్ మినేష్ నారాయణ టండాన్ బుధవారం అందజేశారు. వేములవాడకు వచ్చిన వారు అతిథిగృహంలో కార్యక్రమం నిర్వహించారు. తమ పరిధిలోని 726 జిల్లాల్లో ఇదే మొదటి అప్రిషియేషన్ సర్టిఫికెట్‌ను శ్రీనివాస్‌కు అందజేస్తున్నట్లు సునీల్‌కుమార్ తెలిపారు. అవార్డు అందుకున్న శ్రీనివాస్‌ను క్లబ్ సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో మోటూరి శ్రీనివాస్, నాగేందర్, మధు, కొమురవెళ్లి శ్రీకాంత్, సత్యనారాయణరెడ్డి, శివప్రసాద్ పాల్గొన్నారు. అంతకుముందు వేములవాడ రాజన్నను లయన్స్‌క్లబ్ ఇంటర్నేషనల్ డెరైక్టర్ సునీల్‌కుమార్ దంపతులు, జిల్లా గవర్నర్ మినేష్ నారాయణటండాన్ దంపతులు దర్శించుకున్నారు. అంతకుముందు రాజన్నకు కోడె మొక్కు చెల్లించుకున్నారు.
సేవాభావంతో చాటిచెప్పాలి
సిరిసిల్ల : సేవాభావంతో లయనిజాన్ని సమాజానికి చాటిచెప్పాలని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డెరైక్టర్ ఆర్.సునీల్‌కుమార్ అన్నారు. సిరిసిల్లలో గర్ల్స్ హైస్కూల్లో ఇద్దరు విద్యార్థినులకు సునీల్‌కుమార్ కవిత దంపతులు బుధవారం సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సేవాభావంతో ప్రజలకు సాయమందించినప్పుడే మానవత్వానికి పరిపూర్ణత వస్తుందన్నారు. లయన్స్‌క్లబ్ ప్రతినిధులు నాగుల సంతోష్‌కుమార్, దుర్గాప్రసాద్, శివప్రసాద్, జగన్‌గౌడ్, టి.భాస్కర్, అయ్యప్ప రాము, కృష్ణ, పోకల సుమన్, వేముల నారాయణ తదితరులు పాల్గొన్నారు.
|
|
|