విజిలెన్స్ విచారణ
Viewed:
155
Times | News ID:
237810246
|
|
- Posted by
Ranadheer
on
7/10/2012 1:16:19 PM
in
Mahabubnagar
,
Crime News
|
(మహబూబ్నగర్) ఆమన్గల్లు మండలంలోని మైసిగండి ఆలయంలో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ ఆలయంలో 2008 సంవత్సరం నుంచి హుండీ సొమ్ము వినియోగంలో అవకతవకలు జరిగినట్లు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామచంద్రయ్య విచారణాధికారిని నియమిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. దేవాదాయ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారి ఈ విచారణ నిర్వహించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు కూడా ఆదేశిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
|
|
|