డీలర్‌పై 420 కేసు నమోదు
Viewed:
149
Times | News ID:
23467255
|
|
- Posted by
Ranadheer
on
7/7/2012 1:25:10 PM
in
Nizamabad
,
Crime News
|
లింగంపేట: మండల కేంద్రానికి చెందిన శ్రీ కృష్ణ ఫర్టిలైజ ర్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా ఎరువులను వి క్రయించినందుకు శుక్రవారం వ్యవసాయ శాఖ ఏడీఏ రా ములు లింగంపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రి టైల్ డీలర్ ఎరువులను నిర్ధేశించిన లైసెన్స్ కలిగిన దుకాణంలోనే ఎరువులను విక్రయించాల్సి ఉండగా ఏకంగా ఎరువు ల లారీని ఓంటర్పల్లి గ్రామానికి తరలించి గ్రామంలో విక్రయించడం ప్రభుత్వాన్ని చీట్ చేయడమేనని ఫిర్యాదులో పే ర్కొన్నాడు. అందుకు గాను శ్రీ కృష్ణ ఫర్టిలైజర్ యజమాను లు కాటిపల్లి ప్రభాకర్, శ్రీధర్‌పై చీటింగ్ కేసు నమోదుకు సి ఫార్సు చేసినట్లు ఆయన తెలిపారు.
వ్యవసాయ శాఖను మోసగించినందుకు చర్యలు తీసుకుంటామన్నారు. లింగంపేట పోలీసుస్టేషన్ ఎదుట ఎరువుల కోసం శుక్రవారం రైతులు బారులు తీరారు. మండలానికి శుక్రవారం 1600 యూరియా సంచులు వచ్చాయి. వాటి కోసం వేలాది మంది రైతులు పోలీసుస్టేషన్ ఎదుట బారులుతీరారు. ఒ క్కో రైతుకు పాసుబుక్‌పై రెండు బ్యాగులను మాత్రమే అం దించడంతో యూరియా సరిపోవడం లేదని రైతుల ఏడీఏ రాములును నిలదీశారు. యూరియా సరిపోయేంతగా అం దించే ఏర్పాటు చేయాలని రైతులు ఏడీఏను కోరారు. దానికి ఏడీఏ ఎల్లారెడ్డి, లింగంపేట, నాగిరెడ్డిపేట, తాడ్వాయి మండలాలకు అదనంగా ఎరువులను పంపించే ఏర్పాటును చేస్తామన్నారు. ప్రయివేట్ డీలర్లు వారికి కేటాయించిన 50 శాతం కోటాను నిబంధనల ప్రకారం రైతులకు అందేట్లు చూస్తామన్నారు.
|
|
|