జీసీసీ నుంచి బూజు,పురుగుల బియ్యం సరఫరా
Viewed:
142
Times | News ID:
22705128
|
|
- Posted by
Ranadheer
on
7/5/2012 11:58:41 AM
in
Khammam
,
Crime News
|
పాల్వంచ రూరల్, జూలై 4 : గిరిజన కార్పోరేషన్ గోదాంలో బియ్యం ముక్కిపోయి, బూజుపట్టి దర్శనమిస్తున్నాయి. ఈ బియ్యాన్నే రేషన్ దుకాణాలు, హాస్టళ్ళకు తరలిస్తున్నారు. అలాగే రేషన్ దుకాణాలకు నెలరోజులుగా కందిపప్పు సరపరా నిలిచిపోయింది. పాల్వంచ గిరిజన కా ర్పొరేషన్ సంస్థ నుంచి పాల్వంచ, ములకలల్లి, బూర్గంపహాడ్ మండలాల్లోని రేషన్ దుకాణాలు, హాస్టళ్లకు సరఫరా చేస్తుంటారు. జీసీసీలో నిల్వ ఉన్న బియ్యం బస్తాలు బూజుపట్టి దర్శనమిస్తున్నాయి. బియ్యం తడిసి ముద్దయినట్టుగా నలుపురంగులోకి మారా యి. ఈ బియ్యాన్ని గిరిజన ఆశ్రమ హాస్టళ్లకు అదే విధంగా మూడు మండలాల్లోని 70 రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తున్నా రు. హాస్టళ్ళ విద్యార్థులు దాదాపు రెండు నెలలుగా పురుగులు, బూజుపట్టి గడ్డలు కట్టిన బియ్యాన్నే తింటున్నారు. అ దేవిధంగా జీసీసీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా నిలిపివేశారు. జీసీసీలో కందిపప్పు టెండర్లు నిర్వహించకపోవడం వల్ల సరఫరా ఆగిపోయింది. గత నెల రేషన్ దుకాణాలకు కందిపప్పును సరఫరా చేయలేదు. సుమారు 50 క్వింటాళ్ళ కందిపప్పు జీసీసీ కేంద్రాల నుంచి రేషన్ దుకాణాలకు సరఫరా చేయాల్సి ఉండగా చేయలేకపోయారు. బూజుపట్టిన పురుగుల బియ్యం సరఫరాపై జీసీసీ ఎంఎల్సీ గోదాం ఇన్చార్జి గుణను వివరణ కోరగా రెండు నెలలు గా పౌరసఫరాలశాఖ ఇటువంటి బియ్యాన్నే సరఫరా చేస్తున్నారన్నారు.
|
|
|