వేర్వేరు ప్రమాదాల్లో 20 మందికి గాయాలు
Viewed:
143
Times | News ID:
22344137
|
|
- Posted by
Ranadheer
on
7/4/2012 12:07:07 PM
in
Khammam
,
Crime News
|
కల్లూరు: కల్లూరు సమీపంలో ఓ ట్రాక్టర్ బోల్తా పడడంతో అందులో ఉన్న ఉపాధి కూలీల్లో 12 మందికి గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. కల్లూరు పంచాయతీ పరిధిలోని అంబేద్కర్‌నగర్ కాలనీకి చెందిన ఇందిరమ్మ, వసంత గ్రూపులకు చెందిన 40 మంది మంగళవారం కోనాయికుంట చెరువు పూడిక తీత పనులకు వెళ్లారు. పనులు ముగించుకుని ట్రాక్టర్లో మట్టి నింపుకుని వారు ఇంటికి వస్తున్నారు. వారిలో 22 మంది కూలీలు ట్రాక్టర్‌పై బయలుదేరగా మిగిలిన వారు నడుచుకుంటూ వస్తున్నారు. ట్రాక్టర్ చెరువులో నుంచి కట్టపైకి వస్తుండగా అదుపు తప్పి ట్రక్కు బోల్తా పడింది. దీంతో బయపడిన కూలీలు ఒక్కసారిగా కిందకు దూకారు.
ఈ ప్రమాదంలో దాసరి లక్ష్మి, బర్రె మీరమ్మ, యాదాల సమాధానం, బేతిమళ్ల పద్మ, కనపర్తి లక్ష్మి, కనపర్తి వసంత, ఉబ్బన ముత్తమ్మ, కనపర్తి కమల, పులిగోరు రాణి, దోమశెట్టి అనిత, నారుమళ్ల కుమారి, కొత్తపల్లి నాగమణిలకు గాయాలయ్యాయి. వీరిలో దాసరి లక్ష్మి, మీరమ్మ, సమాధానం, బేతిమళ్ల పద్మలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 ద్వారా కల్లూరు ప్రభుత్వాస్పత్రికి, రెండు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. సమాచారం తెలుసుకున్న ఎంపీడీఓ కె.భారతి, తహశీల్దార్ శ్రీరాములు, ఏపీఓ కోటేశ్వరరావులు, సీఐటీయూ నాయకులు తన్నీరు కృష్ణార్జున్‌రావు, కాంగ్రెస్, టీడీపీ నాయకులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, అత్తునూరి రంగారెడ్డి, పోట్రు సత్యం తదితరులు క్షతగాత్రులను పరామర్శించారు.
వైఎస్ఆర్ సీపీ నాయకుల ఆర్థిక సహాయం
గాయపడిన ఉపాధి కూలీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కీసర వెంకటేశ్వరరెడ్డి పరామర్శించారు. ఒకోక్కరికి రూ.500 చొప్పున గాయపడిన వారందరికి ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు వేము దినాకర్, నోటి కృష్ణారెడ్డి, మంగేష్ పాల్గొన్నారు.
ఆటో బోల్తా: ఎనిమిది మందికి స్వల్ప గాయాలు...
భద్రాచలం రూరల్ : మండల పరిధిలోని కొల్లుగూడెం గ్రామ సమీపంలో జాతీయరహదారిపై మంగళవారం ఓఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. కూనవరం నుంచి పదిమంది ప్రయాణికులతో ఓ ఆటో భద్రాచలం వెళుతోంది. ఈక్రమంలో ఆటో స్టీరింగ్‌లో లోపం తలెత్తటంతో అదుపు తప్పి పది అడుగుల లోతులో ఉన్న పొలంలో పడిపోయింది. దీంతో ఆటోలో ఉన్న ఎనిమిదిమందికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108లో ఏరియా వైద్యశాలకు తరలించారు.
|
|
|