బడిపంతుళ్ల చేతివాటం
Viewed:
134
Times | News ID:
2208324
|
|
- Posted by
Ranadheer
on
7/3/2012 12:34:33 PM
in
Nizamabad
,
Crime News
|
(నిజామాబాద్) జిల్లా విద్యాశాఖ ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియలో తలమునక లై ఉండగా కొందరు ప్రధానోపా«ధ్యాయులు మాత్రం పాఠశాలల అభివృద్ది కోసం ప్రతి ఏటా వచ్చే నిధులను వెనక్కివేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరో పదిరోజుల్లో బదిలీ అవుతామన్న ఆలోచనతో వారు బిల్లులు డ్రా చేయడాని కి గుట్టుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈపాటికే తమ తమ ఖాతాలో జమ అ యిన ఈ నిధులను స్వాహా చేయడానికి తహతహలాడుతున్నారు. ఈ ని«ధులకు సంబంధించి ఆడిట్ కూడా లేకపోవడంతో బోగస్ బిల్లులతో స్వాహా చేయడానికి వ్యూహాలు రచిస్తున్నారు. ఎలాగూఏ బదిలీ అవుతున్పాము కదా అని మిగతా వా రు కూడా ఇదే బాటలో పయనించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉపాధ్యాయుల బదిలీ కోసం ప్రభుత్వం ఈ పాటికే ఉత్తర్వులు జారీచేయడంతోపాటు ఇందుకు సంబంధించి ప్రక్రియను జిల్లా విద్యాశాఖ చేపట్టింది. నిబంధనల ప్ర కారం కనీసం రెండేళ్లు పనిచేసే వారు బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ 8 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న వారికి స్థాన చలనం ఖాయంగా మారింది. దీంతో జి ల్లాలో 16 వందలకు పైగా ఉపాధ్యాయులకు బదిలీలుంటాయని విద్యాశాఖ అం చనా వేస్తోంది. వీరిలో కనీసం 5 వందలకు పైగా ప్రధానోపాధ్యాయులు బదిలీ అయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. వీరంతా ఇప్పటికే కౌన్సెలింగ్ కోస ం దరఖాస్తు చేసుకున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఎలాగూ బదిలీ అవుతున్నామనే ఆలోచనతో కొందరు ప్రధానోపాధ్యాయులు అడ్డదారులు తొక్కే పనిలో పడ్డారు. సంబంధిత అధికారులను మచ్చిక చేసుకుని వారికి ఎంతోకొంత ముట్టచెప్పే పనిలో నిమగ్నమయ్యారని సమాచారం. నిధులను కైంకర్యం చేయడానికి ప్రయత్నిస్త్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ఉన్నఫలంగా నిధులు ఖర్చు చేయడం కంటే ఏదో ఓ బిల్లు పెట్టి డ్రా చేసుకోవడమే సులువని వీరు భావిస్తున్నారు.
ప్రతి యేటా పాఠశాలలు తెరవడానికి ముందే మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం ప్రతి యేటా కోట్లాది రూపాయాలు మంజూరు చేస్తో ంది. ఇందులో ప్రా«థమిక పాఠశాలలకు రూ.5వేలు హైస్కూల్, అప్పర్ ప్రైమరీల కు 10 వేలు, కాంప్లెక్స్ పాఠశాలలకు 25 వేలు, మండల రిసోర్స్ సెంటర్లకు 90వేలు, జాతీయ బాలికల విద్యాపాఠశాలలకు 67వేల రూపాయల చొప్పున ఇ స్తారు. జిల్లాలో 1800 ప్రైమరీ పాఠశాలలుండగా రూ.90 లక్షలు, 460 ఉన్నత పాఠశాలలకు 46 లక్షలు, 350 అప్పర్ ప్రైమరీ పాఠశాలలకు 10 వేల చొప్పున 35 లక్షలు, 272 జాతీయ బాలికల విద్యాపాఠశాలలకు 67 వేల రూపాయల చొ ప్పున కోటి 84 లక్షల రూపాయలు, 90 వేల చొప్పున మండ ల్ రిసోర్స్ సెంటర్స్ కు 32 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధుల విషయంలో అధికారు ల దృష్టి పెద్దగా ఉందదు. అందుకే బదిలీ ప్రక్రియ ముగిసేలోపే ఈ నిధులను మింగేసే ప్లాన్ వేశారు. ఈ బిల్లులకు క్లియరెన్స్ ఇవ్వాల్సిన మండల విద్యాశాఖ అధికారులను సైతం వారిచ్చే పర్సంట్జీలు నోరెత్తకుండా చేస్తున్నట్లు సమాచారం.
|
|
|