వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
Viewed:
141
Times | News ID:
21883135
|
|
- Posted by
Ranadheer
on
7/3/2012 12:05:39 PM
in
Karimnagar
,
Crime News
|
మేడిపల్లి/ కోరుట్ల టౌన్: కోరుట్ల పట్టణంలోని లిమ్రా దాబా దగ్గర ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మేడిపల్లి మండల కేంద్రానికి చెంది న పుల్లాల గంగారాం ఉరఫ్ హోటల్ గంగారాం(48), బొడ్డుపల్లి గంగాధర్(45) ఇద్దరూ స్నేహితులు. ఆదివారం పని నిమిత్తం కోరుట్లకు వెళ్లారు. పని ముగిసిన తర్వాత రాత్రి ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తుండగా వీరి వాహనాన్ని కోరుట్ల నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న వ్యాన్ ఢీకొట్టింది. ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.
వారిని 108లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో గంగాధర్‌ను హైదరాబాద్‌కు తరలిస్తుండగా చనిపోయూడు. గంగారాం కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ చనిపోయూడు. వ్యాన్ డ్రైవర్ నీలం నర్స య్య అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని, కేసు దర్యాప్తు చేస్తున్నామని కోరుట్ల ఎస్సై సురేశ్‌కుమార్ తెలిపారు.
ఉపాధికోసం వచ్చి..
పుల్లాల గంగారాం 30 ఏళ్ల క్రితం మండలంలో ని పోరుమల్ల గ్రామం నుంచి మేడిపెల్లికి వచ్చా డు. హోటల్ పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నా డు. ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ఆయన కుమారులు గల్ఫ్‌లో ఉంటున్నారు. వా రు వచ్చిన తర్వాత మంగళవారం అంత్యక్రియ లు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలి పారు. గంగాధర్ ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లేవా డు. రెండేళ్ల క్రిత ం మేడిపల్లి శివారులో దాబా పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన ఆది
మృతుల కుటుంబసభ్యులను వైఎస్సార్సీపీ కేం ద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు ఆది శ్రీని వాస్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు కుందారపు జలంధర్, మాజీ ఎంపీపీ మకిలి ఇజ్రాయిల్, మాజీ సర్పంచులు క్యాథం దశరథరెడ్డి, గ్యాదం లస్మయ్య, బైర అంజయ్య, ఎంపీటీసీ మాజీ సభ్యుడు పుప్పాల కొంరయ్య తదితరులు పరామర్శించారు.
వేంపేట్ శివారులో యువకుడు...
వేంపేట్, (మెట్పల్లి రూరల్) : మండలంలోని వేంపేట్ శివారులో ఆదివారం రాత్రి జరిగిన రో డ్డు ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన దురిశెట్టి రవీందర్(35) పని మీద జగిత్యాలకు వెళ్లి రాత్రి తిరిగివస్తున్నాడు. వేంపేట్ శివారులోని పెద్దమ్మ ఆలయం దగ్గర అతడి బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ రవీందర్ అక్కడికక్కడే చనిపోయూడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సాబీరోద్దీన్ తెలిపారు.
|
|
|