ప్రాణంపోతున్నా.. పట్టించుకోరా?
Viewed:
181
Times | News ID:
211724122
|
|
- Posted by
Ranadheer
on
6/24/2012 11:52:38 AM
in
Mahabubnagar
,
Health News
|
ధన్వాడ ప్రభుత్వాసుపత్రి వైద్యుల తీరును నిరసిస్తూ రాస్తారోకో
ధన్వాడ: పురుగుమందు తాగి అపస్మారక స్థితికి చేరుకొని స్థానిక ప్రభుత్వాసుపత్రికి వచ్చిన హరిజన భాగ్యమ్మ అనే మహిళకు సకాలంలో వైద్యసహాయం అందలేదని నిరసిస్తూ ధన్వాడలో శనివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దళితులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రికి తాళంవేసి డాక్టర్లు, సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్‌చేస్తూ ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు చంద్రయ్య మాట్లాడుతూ డాక్టర్లు, సిబ్బంది కలిసి ప్రభుత్వ మందులను ప్రైవేట్ దుకాణాల్లో విక్రయిస్తోందని ఆరోపించారు. విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతోనే అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమ్మోహన్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండేళ్లుగా ఆస్పత్రి అభివృద్ధి కమిటీ లేకపోవడం వల్లే పర్యవేక్షణ కరువై, పేదలకు వైద్యసేవలు అందడం లేదన్నారు. డాక్టర్ బాలాజీరావు ఫోన్‌చేసి మినిట్స్‌బుక్ తెప్పించారు. ఈ మినిట్స్‌బుక్‌లో దిద్దుబాట్లు ఉండటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తంచేశారు.
దన్వాడ మండలంలో అన్ని శాఖల అధికారుల పనితీరుపై నిఘా ఉంచామని ఇకముందు ఏ శాఖ అధికారులు విధి నిర్వహణలో విఫలమైన సహించబోమని హెచ్చరించారు. సోమవారం డీఎంఅండ్‌హెచ్‌ఓ ధన్వాడ ఆస్పతిని సందర్శిస్తారని, ఆరోజే ఆస్పతి సమస్యలను చర్చించుకుందామని మాజీ ఎమ్మెల్యే వివరించడంతో దళితులు శాంతించారు. అనంతరం క్లస్టర్ ఇన్చార్జి డాక్టర్ సరస్వతి ఆస్పతిని సందర్శించి విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులకు చార్జ్ మెమోలు అందజేశారు. తాను డాక్టర్లతో మాట్లాడతానని పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తానని మాజీ ఎమ్మెల్యే హామీఇవ్వడంతో దళితులు ఆందోళన విరమించారు. కార్యకమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు చందయ్య, సుధాకర్, అశోక్, నర్సింహ్మ, ఎల్లప్ప, కడపయ్య, బసంత్, టి. నర్సన్న, బాలకిష్టన్న, రాములు, సాయమ్మలు పాల్గొన్నారు.
|
|
|