గురుకుల పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
Viewed:
191
Times | News ID:
195015612
|
|
- Posted by
Ranadheer
on
6/15/2012 4:42:39 PM
in
Warangal
,
General News
|
సుబేదారి: జిల్లాలోని సాంఘిక సంక్షే మ గురుకుల పాఠశాలల్లో 2012-13 విద్యా సంవత్సరానికి 6, 7, 8 తరగతుల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఎస్సీ, ఇతర కులాల నుంచి దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ బా లుర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, కన్వీనర్ డాక్టర్ ఎ.భాస్కర్‌రావు తెలి పారు. విద్యార్థులు ఈ నెల 23వ తేదీలోగా జనగా మ గురుకుల పాఠశాల, కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని ఆయన సూచించా రు.
ఆరో తరగతిలో బాలురకు ఎస్సీలకు 10 సీట్లు, ఎస్టీలకు మూడు సీట్లు, బీసీలకు రెండు సీట్లు, హెచ్‌సీసీ (వికలాంగులకు) 10 సీట్లు, ఓసీలకు ఒక సీటు ఉందని భాస్కర్‌రావు వివరించారు. మడికొండ లో బాలికలకు ఎస్సీలకు ఆరో తరగతిలో 23, ఎస్టీలకు నాలుగు, బీసీలకు మూడు, ఓసీలకు రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. 7వ తరగతి లో (బాలుర) ఎస్సీలకు 75 సీట్లు, ఎస్టీలకు 8 సీ ట్లు, బీసీలకు రెండు సీట్లు, ఓసీలకు రెండు సీట్లు, బాలికల ఎస్సీలకు 47 సీట్లు, ఎస్టీలకు ఐదు సీట్లు, ఎస్టీలకు ఐదు సీట్లు, బీసీలకు రెండు సీట్లు, ఓసీల కు రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు.
8వ తరగతిలో ఎస్సీ (బాలుర కు) 40 సీట్లు, ఎస్సీలకు 5 సీట్లు, బీసీల కు మూడు సీట్లు, ఓసీలకు ఒక సీటు ఖాళీగా ఉంద ని సూచించారు. బాలికల ఎస్సీలకు ఐదు సీట్లు, ఎస్టీలకు నాలుగు సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలి పారు. కాగా, బాలికలకు మడికొండ, జఫర్‌గఢ్, ఇనుగుర్తి, పరకాల, పర్వతగిరి, రాయపర్తి, మడికొండ, తొర్రూర్, మహబూబాబాద్, పాలకుర్తి, కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి, బాలురలో చేర్యాల, నర్సంపేట, జాకారం, స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఖాళీగా ఉన్న సీట్లకు భర్తీ చేస్తామన్నారు. ఈ నె ల 26న లాటర్ పద్ధతిలో విద్యార్థులను ఎంపి క చేయనున్నట్టుడాక్టర్భాస్కర్రావు వివరించారు.
హాస్టళ్లలో ప్రవేశాలకు...
వరంగల్ జిల్లాలోని 99 సాంఘిక సంక్షేమశాఖ వ సతి గృహాల్లో (హాస్టళ్లు) 2012-13 విద్యా సంవత్సరానికి ప్రవేశాల కోసం దరఖాస్తులు జిల్లాలోని సహాయ సాంఘిక సంక్షేమశాఖాధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ పి.వెంకటరత్నం తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు విద్యార్థులు హాస్టళ్లలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
|
|
|