గురువును ఘనంగా సన్మానించిన శిష్యులు
Viewed:
151
Times | News ID:
178412553
|
|
- Posted by
Ranadheer
on
6/12/2012 4:23:24 PM
in
Adilabad
,
General News
|
నిర్మల్ టౌన్: ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది సమాజంలో ఉన్నతమైన విలువ తో కూడిన ఉద్యోగంలో స్థిరపడేటట్లుగా చేసిన గురువును సోమవారం నిర్మల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో విశ్రాంత తెలుగు అధ్యాపకులు వీరమల్ల పోశెట్టి దంపతులను నిర్మల్ డివిజన్ తెలుగు పండితులు ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎందరో మంది తెలుగు పండితులను ఆయన తయారు చేశారని వక్తలు పోగడ్తాలతో ముంచెత్తారు. విశారద, పీడీసీ, బీఓఎల్ లాంటి తెలుగు పరీక్షలను తన ఆధ్వర్యంలో నిర్వహించి జిల్లాలో తెలుగు పండితులను లేని లోటు తీర్చారని ఆయన శిష్యులు అన్నారు.
ప్రస్తుతం నిర్మల్ డివిజన్లో ప్రతి పాఠశాలలో ఆయన వద్ద శిష్యరికం చేసిన వారే తెలుగు పండితులుగా విద్యార్థులకు బోధిస్తున్నారు. ఈకార్యక్రమంలో ఆపాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగాధర్, ఆర్విఎం శిక్షణ తరగతుల డీఆర్పీలు, ఉపాధ్యాయులు వై. సాయన్న, టి. గంగాధర్, అంబడి నారాయణ, ఎ. వెంకటరమణ, జి. సాయన్న, బోజాడి పురుషోత్తంరావు, పి. వెంకటేశ్వర్లు, ఆర్. ముత్తన్న, పి.రాజేశ్వర్, వి. మధుకర్, తదితరులు పాల్గొన్నారు.
|
|
|