జనాభాలో నెం.1
Viewed:
136
Times | News ID:
16398234
|
|
- Posted by
Ranadheer
on
6/8/2012 1:04:03 PM
in
Rangareddy
,
District News
|
(రంగారెడ్డి జిల్లా) జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు క్రమం గా కనుమరుగవుతున్నాయి. పట్టణ జనాభా రాష్ట్రంలోనే అధికంగా పెరిగిపోతోంది. 2011కు సంబంధించి జనగణన చేపట్టిన కేంద్రం జనాభా, పౌర సౌకర్యాలు, ఇతర అనేక అంశాలకు సంబంధించి తాజాగా గణాంకాలు విడుదల చేసింది. దీని ప్రకారం జిల్లా జనాభా 52.96 లక్షలుగా నిర్ధారించారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికం. అలాగే పట్టణ ప్రాంత జనాభా గణనీయగా పెరిగింది. మొత్త జనాభాలో 70.32 శాతం మంది పట్టణల్లో నివసించడం గమనార్హం.
గత పదేళ్లలో 92.19 శాతం పట్టణ జనాభా పెరగగా గ్రామీణ ప్రాంత జనాభా భారీ గా తగ్గిపోయింది. జిల్లా జనాభా 52, 96,396 కాగా ఇందులో పట్టణ ప్రాం తాల్లో 37,24,364 మంది నివసిస్తున్నారు. గ్రామీణప్రాంతాల్లో 15,72,032 మంది ఉన్నారు. గడిచిన పదేళ్లలో పట్టణ జనాభా దాదాపు రెట్టింపుకాగా గ్రామీణప్రాంత జనాభా 3.98 శాతానికి తగ్గడం గమనార్హం. పురుషులు, స్త్రీల నిష్పత్తి మధ్య వ్యత్యాసం గతం కంటే కాస్త తగ్గినా ఇంకా ప్రమాదకర స్థాయిలోనే ఉంది. పదేళ్ల కిదట పురుషులు, స్త్రీలు నిష్పత్తి 1000 : 944 ఉండగా ఇపుడు ఇది కాస్త 1000:955కి పెరిగింది.
మొత్తం జనాభాలో పురుషులు 27,08, 694 మంది ఉండగా స్త్రీలు 25,87,702 మంది ఉన్నారు. అక్షరాస్యతలో కూడా జిల్లా మెరుగుపడింది. గతంలో 66.16 శాతం ఉన్న అక్షరాస్యత ఇపుడు 78.05 శాతానికి పెరిగింది. 0-6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు జిల్లాలో 13.99 లక్షల మంది ఉన్నారు. జిల్లాలో గత పదేళ్ల కిందట 54.2 శాతం ఉన్న పట్టణ జనాభా ఇపుడు 70.32శాతానికి పెరిగింది. అలాగే గ్రామీణ ప్రాంత జనాభా 45.80 శాతం నుంచి 29.68 శాతానికి తగ్గిపోవడం గమనార్హం. జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందడంతో గ్రామీణ ప్రాంత జనాభా క్రమేపీ తగ్గిపోతుంది.
జిల్లాలో 12,63,714 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇందులో 59.6 శాతం మంది కాంక్రిట్ ఇళ్లలో నివసిస్తున్నారు. 1.4 శాతం మంది సాధారణ గుడిసెల్లో, 0.8 శాతం మంది ప్లాస్టిక్ షీట్లు వేసుకున్న గుడిసెల్లో ఆవాసం ఉంటున్నారు. బండరాళ్లతో నిర్మించిన ఇళ్లలో 12.5 శాతం నివసిస్తున్నారు. జిల్లాలో 87 శాతానికి మాత్రమే తాగునీటి సదుపా యం ఉంది. ఇందులో 72.3శాతం మంది శుద్ధి చేసిన నీటిని తాగుతున్నారు. 14.7 శాతం మందికి సురక్షిత నీరు దొరకడం లేదు. 3.1 శాతం మంది చేతి పంపుల ద్వారా వచ్చే నీటిని తాగుతున్నారు.
వివాహ వ్యవస్థలో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. సగటు వంద మందిలో 9.4 శాతం మంది రెండో వివాహం చేసుకుంటున్నారు. మూడో వివాహం చేసుకుంటున్న వారి సంఖ్య కూడా 1.5 శాతం ఉండడం గమనార్హం. 0.2 శాతం మంది మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.
ౖ జిల్లాలో 61 శాతం కుటుంబాలు ఎల్పీజీ గ్యాస్ వాడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గ్యాస్ వాడకం గడిచిన పదేళ్లల్లో గణనీయంగా పెరిగింది. అయితే ఇంకా 25 శాతం కుటుంబాలు ఇంకా కట్టెలమీద వంట చేసుకుంటున్నాయి. 10.6 శాతం కుటుంబాలు కిరోసిన్ ఆధారంగా వంట చేస్తున్నాయి.
జిల్లాలో 12,63,714 కుటుంబాలు ఉండగా ఇందులో 95.9 శాతం ఇళ్లకు విద్యుత్ సౌకర్యం ఉంది. 3.2 శాతం కుటుంబాలు మాత్రం కిరోసిన్ దీపాలనే వాడుతున్నారు. 0.4 శాతం కుటుంబాలు సొలార్ను వినియోగిస్తున్నారు.
|
|
|