నేరాల అదుపునకు జిల్లాలో 12 చెక్‌పోస్టులు
Viewed:
137
Times | News ID:
16368231
|
|
- Posted by
Ranadheer
on
6/8/2012 1:01:25 PM
in
Rangareddy
,
District News
|
తాండూరు రూరల్, జూన్ 7: జిల్లాలో నేరాలను అదుపు చేయడానికి 12 చెక్‌పోస్టులను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా గ్రామీణ ఎస్పీ రాజకుమారి వెల్లడించారు. గురువారం ఆమె తాండూరు మండలం కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. చెక్‌పోస్టుల వద్ద 3 నుంచి 5 మందిని పోలీసు సిబ్బం దిని నియమిస్తున్నట్లు చెప్పారు. వాహనాలను తనిఖీ చేయడం అంతర్రాష్ట్ర వాహనాలపై, అక్రమరవాణాపై ప్రత్యేక నిఘా పెడుతున్నట్లు ఆమె వెల్లడించారు. శంకర్పల్లి మండలం మహారాజ్‌గంజ్, షాబాద్ మండ లం హైతాబాద్, చేవేళ్ల మండలం ముడిమ్యాల, పెద్దేముల్ మండలం తట్టేపల్లి, బషీరాబాద్ మండలం మైల్వార్, తాండూరు మండలం కొత్లాపూర్, గండీడ్ మండలం మహ్మదాబాద్, బంట్వారం మండలం తొర్మామిడి గ్రామాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా రూరల్ పరిధిలోని 21 పోలీస్స్టేషన్లలో వరకట్నం కింద 50 కేసులు నమోదయ్యాయనీ, కేసుల పరిష్కారం కోసం భార్యభర్తలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు. ఫిర్యాదుదారుల అభ్యర్థన మేరకే కేసులు నమోదు చేస్తామని వివరించారు. కొన్ని గ్రేడ్-1 కేసులు ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. తన పరిధిలో ఉన్న మోమిన్‌పేట్, కరన్‌కోట్, తాండూరు, శంకర్పల్లి, వికారాబాద్ పోలీస్స్టేషన్లలో ఖాళీగా ఉన్న ఎస్ఐ పోస్టులను నెలా ఖరు నాటికి భర్తీ చేస్తామన్నారు. తాండూరు సబ్‌డివిజన్ పరిధిలో క్రైం రేటు ఎక్కువగా ఉందని ఆమె వివరించారు. వివాహేతర సంబంధాలు, మద్యం, పాతకక్షలు వంటి కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు.
కేసులు నియంత్రించడానికి పోలీస్‌శాఖ ద్వార విలేజ్ నైట్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సంబంధాలను మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నామని తద్వార ప్రజలకు అవగాహన కలిగి పోలీస్‌స్టేషన్ వరకు రాకుండా సమస్యను అక్కడికక్కడే పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రజల కోసం పోలీస్‌శాఖ ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నెంబర్ 1091కు ఫోన్‌చేసి సమస్యలు తెలియజేస్తే న్యాయం చేస్తామని చెప్పారు. డాగ్, ట్రాకల్గార్డ్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ భవనానికి, వికారాబాద్‌లోని మహిళా పోలీస్‌స్టేషన్ భవనాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు.
పెండింగ్‌లో ఉన్న కేసులన్నింటినీ త్వరగా పరిష్కరించాలని గ్రామీణ ఎస్పీ రాజకుమారి స్థానిక పోలీసులను ఆదేశించారు. గురువారం తాండూరు మండ లం కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. నేరాల వివరాలను స్థానిక పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. కారు ఢీకొట్టిన వ్యక్తి ఇతర దేశాల్లో ఉన్నాడని, ఈ కేసు 2005 సంవత్సరం నుంచి పెండింగ్‌లో ఉందని పోలీసులు తెలపగా, ఆ కేసుకు సంబంధించిన నిందితుడు సోహెబ్‌పై విచారణ జరిపి పాస్‌పోర్టు సంబంధిత వివరాలను సేకరించి అరెస్టుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌లో ఇప్పటి వరకు 41 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని పోలీసులు వివరించారు. కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఉన్నందున గస్తీ ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ ఉదయ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
|
|
|