డిగ్రీ ప్రవేశానికి గడువును పెంచాలి
Viewed:
119
Times | News ID:
1617829
|
|
- Posted by
Ranadheer
on
6/8/2012 12:39:30 PM
in
Mahabubnagar
,
District News
|
జెడ్పీసెంటర్: ముందస్తు సమాచారం లేకుండా డిగ్రీ దరఖాస్తు గడువును ముగించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యు డు సయ్యద్ ఇబ్రహీం అన్నారు. డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తు గ డువు పెంచాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గు రువారం పీయూ రిజిస్ట్రార్ వెంకటాచలంకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 6వ తేదీన ముగిసిన డిగ్రీ ప్రవేశ గడువును మరో 15 రో జులకు పెంచాలని డిమాండ్ చేశారు. ముందస్తు ప్రకటన చే యకుండా గడువు ముగియడంతో జిల్లాలోని గ్రామీణ విద్యార్థులు ఉన్నత చదువుకు దూరమయ్యే ప్రమాదముందని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన జిల్లాలో పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని డిగ్రీ ప్రవేశానికి గడువు పెంచాలని ఆ యన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ కార్మిక వి భాగం జిల్లా ప్రధాన కార్యదర్శి మిట్టె నర్సింహ్మా, నాయకులు వినోద్, రహిం, ప్రశాంత్, సుల్తాన్, షఫి పాల్గొన్నారు.
గడువు పెంచకుంటే ఆందోళనలు...
డిగ్రీలో ప్రవేశానికి దరఖాస్తుల గడువును పెంచాలని ఏబీ వీపీ నగర సంఘర్షణ కార్యదర్శి ఐలయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రిజిస్ట్రార్ వెంకటాచలంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడువును పెంచకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వినతిపత్రం ఇచ్చినవారిలో నాయకులు అయ్యప్ప, లక్ష్మణ్, నర్సింహ్మ, రాజేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
|
|
|