అడుగు.. అడుగుకో తనిఖీ..
Viewed:
169
Times | News ID:
16068150
|
|
- Posted by
Ranadheer
on
6/8/2012 12:20:43 PM
in
Khammam
,
General News
|
ఓ పక్క రవాణాశాఖాధికారులు ఆ పత్రం లేదు, ఈ పత్రం లేదంటూ వాహనదారులకు ఫైన్ల రూపం చూపిస్తుంటే పులిమీద పుట్రలా ఇప్పుడు పోలీసులు తమ ప్రతాపం చూపుతుండటంతో బిత్తరపోయి బేజారెత్తిపోవడం వాహనదారుల వంతు అవుతోంది. గత కొన్నాళ్లుగా జిల్లా కేంద్రంలో వాహన తనిఖీలు నిత్యకృత్యంగా మా రాయి. ఆకస్మికంగా ఎప్పుడో ఓ మారు జరిగే తనిఖీలు ఇలా నిత్యకృత్యం ఎలా అయ్యాయని ఆ రా తీస్తే కొత్త సత్యం వెలుగుచూసింది.
గతంలో నెలాఖరుకు ఇన్ని అని పిీటీ కేసులు నమోదుచేస్తుండేవారు. కానీ తాజాగా వాహనాల తనిఖీల కు సంబంధించి పై అధికారులు 150కి తక్కువగాకుండా కేసులు నమోదుచేయాలని అనధికారి క, మౌఖిక హుకుం జారీచేసినట్టు సమాచారం. దీంతో ఇక కిందిస్ధాయి ఖాకీలు టార్గెట్-150 అం టూ జనం మీద పడుతున్నారు. ఆ టార్గెట్ను పూర్తి చేయడానికి ప్రజలను 'టార్గెట్' చేశారన్న విమర్శలు వినవస్తున్నాయి.
మహిళా పోలీసులు సైతం.. ఆ ఠాణా, ఈ ఠాణా అనే బేధం లేకుండా అన్ని ఠాణా బాధ్యులు ఈ తనిఖీలు నిర్వహిస్తూ వాహనదారుల నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు. దీంతో మహిళ సమస్యల తాలూకూ కేసులతో తలమునకలై ఉండాల్సిన మహిళా పోలీసులూ రోడ్డెక్కుతున్నారు. పలు చౌరస్తాల్లో పీఠం వేసి వాహనదారుల నుంచి జరిమానాలు వ సూలు చేస్తున్నారు.
డబుల్ ధమాకా... నిర్ధేశిత టార్గెట్ త్వరగా చేరుకోవాలనే ఆలోచనతో కొందరు పోలీసు అధికారులు చూపుతున్న అత్యుత్సాహం వాహనచోదకులను ఇబ్బందుల పాల్జేస్తోంది. ఇటీవల ఓ ్రపైవేటు ఉద్యోగిని పురపాలక సంఘం కార్యాలయం వద్ద వన్ టౌన్ పో లీసులు తనిఖీ చేసి.. కాగితాలు లేవని అతనికి జ రిమానా విధించారు. సదరు వ్యక్తి ఉసురుమం టూ ఆ జరిమానా చెల్లించాడు. అదేరోజు కొద్దిసేపటి తరువాత మధ్యగేటు అవతలి పక్కకు వెళ్లాడు. అక్కడ తనిఖీలు ని ర్వహిస్తున్న పోలీసులు అతన్ని నిలువరించారు. తాను ఫైన్ కట్టానని తనను వదలాలని మొ రపెట్టుకున్నాడు. ఆ టౌన్ వేరు, ఈ టౌన్ వేరు అంటూ అతనితో బలవంతంగా మరోమారు జరిమానా కట్టించుకు న్నారని బాధితుడు వాపోయాడు. ఇలాంటి డ బుల్ ఢమాకాలు అనేకం.
అసౌకర్యం... పోలీసులు జరుపుతున్న ఈ అడుగడుగు తనిఖీలు వాహనచోదకులకు పలు సందర్భాల్లో అసౌకర్యాన్ని కలుగజేస్తున్నాయి. అన్ని కాగితాలు సక్రమంగా సంబంధిత అధికారులు పరిశీలించేంతవరకు గంటలతరబడి వేచి ఉండాల్సి రావడం అత్యవసర పనులపై వెళుతున్న వారికి తీవ్ర అసౌకర్యాన్ని కలుగజేస్తోంది.
సదుద్దేశమే అయినా... ఖమ్మం పట్టణంలో ఇటీవల ద్విచక్రవాహనా లు జోరుగా చోరికి గురవుతున్నాయి. ఇలా చేపట్టే వాహన తనిఖీలు వాహనదొంగలకు చెక్ పెడతాయనే భావన, అసాంఘిక శక్తులు దొరికిపోయే వీలుందనే ఆలోచన అధికారులను ఈ వాహనతనిఖీలకు పురికొల్పి ఉండవచ్చు. కానీ ప్రజలకు సౌ కర్యంగా లేని ఏ ప్రక్రియ అయినా వారి అభిమానాన్ని చొరగొనదు. వాహనతనిఖీలు ఆకస్మికంగా గాక నిర్ధేశిత సమయాల్లోనే జరుగుతున్న విషయం అసాంఘీకశక్తులు, వాహనదారులు గు ర్తిస్తే అధికారులు ఆలోచనలు సత్ఫలితాలను ఇ వ్వకపోవచ్చు. అది ప్రజలు, పోలీసులకు మధ్య మరింత దూరాన్ని పెంచవచ్చు. అలా జరగకుం డా ఉండేలా ఓ పక్క ప్రణాళికతో వాహన తనిఖీ లు జరిగేలా అధికారులు చర్యలు చేపట్టినట్టయితే అందరికీ సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది.
|
|
|