శిక్షణ అస్వస్థతకు గురైన ఉపాధ్యాయుడి మృతి
Viewed:
158
Times | News ID:
16028146
|
|
- Posted by
Ranadheer
on
6/8/2012 12:16:14 PM
in
Karimnagar
,
Crime News
|
సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండలంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో ఎం. చంద్రమౌళి అనే ఉపాధ్యాయుడు అస్వస్థతకు గురై గురువారం మృతి చెందాడు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు సోషల్ సబ్జెక్ట్ పై ప్రత్యేక శిక్షణ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొంటున్న ఉపాధ్యాయులు ఎం. చంద్రమౌళి గురువారం అస్వస్థతకు గురి కావడంతో చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స జరుపుతుండగా మృతి చెందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మృతుడు ఉపాధ్యాయుడు ఎం. చంద్రమౌళి స్కూల్ అసిస్టెంట్‌గా జమ్మికుంట మండలంలోని బూజునూర్ గ్రామంలో పనిచేస్తున్నాడు. ఉపాధ్యాయుడు ఎం. చంద్రమౌళి మృతి చెందడం పట్ల టిఆర్టియు ఉపాధ్యాయ సంఘం సుల్తానాబాద్ మండల శాఖ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, కార్యదర్శి శ్రావణ్రెడ్డిలు సంతాపం వ్యక్తం చేశారు.
|
|
|