ఎనిమిది మంది ఎక్సైజ్ సీఐల బదిలీ
Viewed:
152
Times | News ID:
15657826
|
|
- Posted by
Ranadheer
on
6/7/2012 6:56:17 PM
in
Nalgonda
,
District News
|
నల్లగొండ: జిల్లాలో ఎనిమిది మంది ఎక్పైజ్ సీఐలకు స్థాన చలనం కలిగింది. నాంపల్లిలో పనిచేస్తున్న ధనుంజయ్‌ని సంగారెడ్డికి, నల్లగొండ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేస్తున్న నరేందర్‌ను నిజామాబాద్ జిల్లా కామారెడ్డికి, మోత్కూరు సీఐగా పనిచేస్తున్న ఆర్.బాలాజీనాయక్‌ను రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్కు బదిలీ చేశారు. నకిరేకల్ సీఐ రామకృష్ణను జిల్లాలోని ఆమనగల్లు స్టేషన్‌కు, ఖాళీగా ఉన్న నల్లగొండ సీఐ స్థానంలో హైదరాబాద్‌కు చెందిన కృష్ణమూర్తి, హాలియాకు ధన్వంతరెడ్డి, నకిరేకల్‌కు సైరాన్ను నియమిస్తూ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు.
|
|
|