సిటీకి సరికొత్త కాంతులు
Viewed:
171
Times | News ID:
12832115
|
|
- Posted by
Ranadheer
on
6/2/2012 11:45:08 AM
in
Hyderabad
,
General News
|
రెండున్నరేళ్ల కిత్రం వరకూ ఒక వెలుగు వెలిగి .. ఆ తరువాత ఒక్క సారిగా స్తబ్దుగా మారిన రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటున్న ట్టు కనిపిస్తోంది. మాంద్యం దెబ్బ తగ్గింది. ఐటీ బూమ్ పెరిగింది. జనరిక్ మందులకు యురోపియన్ దేశాల్లో రెడ్ కార్పెట్ పరుస్తుం డడంతో నగర ఫార్మా రంగం దూసుకుపో తోంది. నగరంలో కీలకమైన 'మెట్రో రైలు'ను పట్టాలెక్కించడానికి 'ఎల్ అండ్ టీ' పిల్లర్లను సిద్ధం చేస్తోంది.
వీటన్నింటి కారణంగా రియల్ రంగంలోనూ మళ్లీ ఊపు మొదలైంది. కొన్నాళ్లు గా కొనుగోలుదారులు లేక విల విల్లాడిన 'విల్లాల' రూపకర్తల్లో మళ్లీ ఆనందం కనిపి స్తోంది. స్పానిష్ .. ఇటాలియన్ విల్లాల బుకిం గ్స్ జోరందుకున్నాయి. మరో వైపు పెరిగిన పర్యాటక రంగానికి అవసరమైన నక్షత్ర హోటళ్ల నిర్మాణం వేగం పుంజుకుంది. ఇప్పటికే ఆరు నక్షత్ర హోటళ్లు సేవలు అందించడానికి సిద్ధమ య్యాయి. ఔటర్‌రింగ్ రోడ్డు లోపల మరో ఐదు స్టార్ హోటళ్లు అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. నగరవాసులకు మల్టీప్లెక్స్‌లపై అభిమానం పెరుగుతుండడంతో ఓడియన్ థి యేటర్ సైతం అలాగే మారనుంది. దీనికో సం గ్రేటర్ నుంచి అనుమతులు తీసుకుంది. ఇలాం టి మల్టీప్లెక్స్‌లు నగరంలో ఎనిమిది అందు బాటులోకి వస్తున్నాయి. మరో ఆరు ప్రతిపాద నలు పెండింగ్‌లో ఉన్నాయి.
కొత్తగా నక్షత్ర హోటళ్లు ..
నగరంలో ఐదు నక్షత్ర హోటళ్ల నిర్మాణం .. కొత్త హోటళ్ల నిర్మాణ ప్రతిపాదనలు జోరందు కున్నాయి. మాంద్యం దెబ్బకు విలవిల్లాడిన సంస్థలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటుండటంతో నగరంలో పర్యాటకుల సంఖ్య పెరిగింది. అం తర్జాతీయ విమానాశ్రయం మూలంగా కార్పొ రేట్ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా సమా వేశాలు, సమీక్షలు నిర్వహించడానికి ఇష్టపడు తున్నాయి. దేశంలో ఢిల్లీ, ముంబయి, బెంగళూ రులతో పోలిస్తే ధరలు తక్కువ కావడంతో కార్పొరేట్ సంస్థలు నగరం కేంద్రంగా సమావే శాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి.
ప్రశాంత మైన వాతావరణం.. గచ్చిబౌలి వంటి బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న హైటెక్స్‌లోని సౌకర్యా లు వారిని అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇది నగరంలో మరికొన్ని నక్షత్ర హోటళ్ల నిర్మాణా నికి కారణ మైంది. మాదాపూర్‌లో ఒకటి, శిల్పా రామం ఒకటి , బంజారాహిల్స్‌లో ఒకటి అతి థులకు సేవలందించడానికి సిద్ధమైపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏడు స్టార్‌హోటళ్లు అనుమతులు తీసుకున్నట్లు సీసీపీ రఘు తెలి పారు. అలాగే ఔటర్ రింగ్ రోడ్డు లోపల మరో ఐదు స్టార్ హోటళ్ల ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. అయితే వీరెవరూ గ్రేటర్ నుంచి ఇంకా అనుమతులు తీసుకోలే దన్నారు.
మల్టీప్లెక్స్‌ల జోరు ..
నగర పౌరులు మల్టీప్లెక్స్‌పై చూపుతున్న అభిమానాన్ని కార్పొరేట్ సంస్థలు క్యాష్ చేసు కుంటున్నాయి. చిక్కడపల్లిలోని పాత ఓడియన్ థియేటర్ యాజమాన్యం ఈ మధ్యనే గ్రేటర్ నుంచి మల్టీప్లెక్స్ నిర్మాణం కోసం అను మతులు తీసుకుంది. త్వరలో ఈ థియేటర్ స్థానంలో హైటెక్ హంగులతో మల్టీప్లెక్స్ ఏర్పా టు కానుంది. ఉప్పల్ సర్కిల్ పరిధిలో రెండు, మల్కాజ్‌గిరిలో ఒకటి, కూకట్‌పల్లిలో రెండు, చందానగర్‌లో ఒకటి, అత్తాపూర్‌లో ఒకటి చొప్పున మలీల్టిప్లెక్స్లకు అనుమతులు తీసుకు న్నాయి. త్వరలో మరో ఆరు ప్రాంతాల్లో మల్టీప్లెక్స్ నిర్మాణం ప్రారంభం కానున్నట్లు అదనపు చీఫ్ టౌన్‌ప్లానింగ్ అధికారి వీ రాముడు తెలిపారు.
మెట్రో రైలు ఎఫెక్ట్ ...
రెండున్నర సంవత్సరాలుగా నగరవాసుల ను ఊరిస్తున్న ప్రతిష్ఠాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్టు పనులు వేగవంతంగా సాగుతున్నా యి. మెట్రో ప్రతిపాదిత కారిడార్లలోనూ రియల్ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఉప్పల్, నాగోల్ పరిసరాల్లో భూము ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ మ ధ్యనే రాష్ట్ర ప్రభుత్వం వివాదస్పదమైన మియాపూర్ భూముల్ని ఎల్అండ్టీకి అప్పగించడంతో ఆ పరిసర ప్రాంతాల్లోనూ భూములకు డిమాండ్ పెరిగింది. ఈ ప్ర భావం మియాపూర్‌కు రెండు వైపులా కని పిస్తోంది. ఇది చందానగర్, గంగారం, మదీ నాగూడల నుంచి హైదర్‌నగర్, నిజాంపేటల వరకూ ఉంది. నాగోల్- మెట్టుగూడ కారిరి డార్లో పనులు వేగంగా జరుగుతున్నాయి. పిల్లర్ల నిర్మాణ వేగం పెం చడంతోపాటు అమీర్‌పేట - శిల్పారామం కారిడార్‌లో తలెత్తిన వివాదాన్ని సానుకూ లంగా చర్చించి పరిష్కరించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో మెట్రో ఆశలు చిగురించాయి. మాదాపూర్ మెట్రో రైల్ స్టేషన్ ముందే గ్రీన్‌ల్యాండ్స్ యాజమాన్యం 'ఆవాస' హోటల్ నిర్మాణం చేపట్టింది. అలాగే మియాపూర్ మెట్రో డిపోకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మై హోమ్స్ ప్రాజెక్టు ముందు మల్టిఫ్లెక్స్ సిద్ధమవుతోంది. ఉప్పల్, నాగోల్ పరిసరాల్లో అపార్టుమెంట్ల నుంచి మల్టిఫ్లెక్స్‌ల వరకూ నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి.
జీవ వైవిధ్య సదస్సు ..
నగరం వేదికగా అక్టోబరులో జరగనున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు -సీఓపీ 11కు 190 దేశాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు. ఈ సదస్సు హైటెక్స్ వేదికైనప్ప టికీ సందర్శకులకు విడిది ఏర్పాట్ల కోసం పర్యాటక శాఖ భారీ కసరత్తు ప్రారంభించింది. ఏ హోటల్లో ఎంత మందికి విడిది ఏర్పాటు చేయాలనే లెక్కలు సిద్ధం చేశారు. హోటళ్లలో అడ్వాన్స్ బుకింగ్ సైతం చేశారు. వీరు బుక్ చేసన హోటళ్లలో అప్పటికి అందుబాటులోకి రానున్న మాదాపూర్‌లోని ఆవాస హోటల్ , శిల్పారామంలో గోల్డెన్ జూబ్లీ హోటల్ , బంజారాహిల్స్ రోడ్డు నెంబరు 2లోని గాయత్రి హోటల్ కూడా ఉన్నాయి.
ఫార్మా , ఐటీ రంగాల వృద్ధి ...
నగరంలో ఫార్మా కంపెనీలపై మాంద్యం ప్రభావం కనిపించలేదు. పైగా నగరంలో త యారు చేసే జనరిక్ మందులకు యూ రోపియన్ దేశాలు ఎర్రతివాచీ పరిచాయి. దీంతో ఫార్మా రంగం ఉత్పత్తులు రెండింతలు పెరిగాయి. లాభాలు అదే స్థాయిలో వచ్చా యి. ఈ బెనిఫిట్స్‌ను యాజమాన్యాలు టాప్ లెవల్ ఉద్యోగులతోపాటూ కిందిస్థాయి సిబ్బందికీ పంచాయి. అలాగే ఐటీ రంగం మాంద్యం దెబ్బ నుంచి పుంజుకొంది. నగర ఐటీ సంస్థలు వివిధ దేశాల నుంచి భారీ ఎత్తున ప్రాజెక్టులను చేజిక్కించుకున్నాయి. ఫలితంగా ఐటీలో బూమ్ వచ్చింది. కొత్త ఓపినింగ్స్ మొదలయ్యాయి.
ఉన్న వారికి పదోన్నతులు .. జీతభత్యాలు పెరుగుతున్నా యి. ఈ ప్రభావం వీరి కొనుగోలు శక్తిపై స్పష్టంగా కనిపిస్తోంది. ఫార్మా, ఐటీ రంగాలు మెరుగైన ఫలితాలు వెలువరించడంతో మాంద్యం దెబ్బకు ఆ మధ్య కుదేలైన విల్లాల అమ్మకాలు మళ్లీ ఊపందుకు న్నాయి. స్పానిష్ విల్లా .. ఇటాలియన్ విల్లా .. లగ్జరీ విల్లా పేరు ఎదైతేనేం బూమ్ సమయంలో ఏ విధంగా విక్రయాలు జరిగాయో అదే స్థాయిలో ఇప్పుడూ సేల్ అవుతున్నాయి. కూకట్‌పల్లిలో పన్నెండు ఎకరాల్లో చేపట్టిన 'రాంకీ పెరల్' నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. గచ్చిబౌ లికి దగ్గరలో బండ్లగూడ, నార్సింగ్‌లలో రాథా రియాల్టీకి నాలుగు విల్లాల ప్రాజెక్టులున్నాయి. మెపుల్ టౌన్ ఫేజ్ -1, ఫేజ్-2ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. తెల్లాపూర్ సమీపం లో విజన్ ఎవెన్యూస్ , బ్లూమ్ ఫీల్డ్స్ ఎక్స్టసీ , ల్యాంకో, అపర్ణాలలోనూ అమ్మకాలు ఊపందు కున్నాయి.
ధరల ప్రభావం ...
మార్కెట్లో కరెక్షన్ ఒక రకంగా రియల్ రంగానికి మంచి చేసింది. స్థలాల ధరలతో పాటు విల్లాలు, అపార్టుమెంట్ల ధరలు 25 -30 శాతం వరకూ తగ్గాయి. ఇది సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకున్న వాళ్లకు కలిసిసొ చ్చింది. అందుకు కొనుగోలుకు ఆసక్తి చూపు తున్నారు. సిమెంట్, స్టీల్ ధరల్లో వచ్చిన వ్యత్యాసాలు వినియోదారులకు లాభించాయి. ఒక వైపు ఫ్లాట్లు, విల్లాల ధరలు తగ్గడం .. మరో వైపు ఐటీ, బీపీఓ , ఫార్మా సంస్థల్లో వృద్ధి నగర రియల్ రంగంపై సానుకూలమైన ప్రభావం చూపుతోందని 'ట్రూ విజన్ రియల్ ఎస్టేట్స్' సంస్థ నిర్వహకులు కోనా లక్ష్మణ్‌రావు 'ఆన్లైన్'తో చెప్పారు. 1
|
|
|