అమ్మో.. జూన్ !
Viewed:
161
Times | News ID:
12631526
|
|
- Posted by
Ranadheer
on
6/1/2012 3:56:53 PM
in
Rangareddy
,
General News
|
సగటు జీవులకు వురింత ఆర్థిక భారం
మరో పదిరోజుల్లో తెరుచుకోనున్న పాఠశాలలు
జూన్ ... సగటు మధ్యతరగతి కుటుంబ పెద్దను బెదరగొట్టే నెల. జూన్ వస్తోందంటే చాలు ముచ్చెమటలు పడుతుంటాయి. ప్రతినెలా ఉండే సాధారణ ఖర్చుకు కొన్ని రెట్లు ఎక్కువగా ఖర్చు రూపంలో జేబుకు భారీ చిల్లుపెట్టే మాసం. పాఠశాలలు ఈ నెలలోనే తెరుస్తుండటమే దీనికి కారణం. టర్మ్ ఫీజు, పుస్తకాలు, యూనిఫామ్, బూట్లు, టై, కంపాస్బాక్స్, స్కూల్ వ్యాన్... ఇలా అన్నింటికి సంబంధించి ఈ నెలలోనే ఫీజులు సమర్పించుకోవాల్సి ఉన్నందున... సాధారణ మధ్యతరగతి కుటుంబంపై పెద్ద భారమే ఉంటుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పెద్దగా ఖర్చులు లేనప్పటికీ, ప్రైవేటు బడుల్లో చదివే పిల్లల ఖర్చు మాత్రం తడిసి మోపడవుతుంది. ఏ యేటికాయేడు ప్రైవేటు బడుల్లో చదివే పిల్లల సంఖ్య పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా ప్రైవేటు విద్య క్రమంగా భారమవుతోంది. నగరానికి చేరువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఖర్చు మరింత ఎక్కువగా ఉంటోంది. సగటున ఒక్కో విద్యార్థికి ‘జూన్ బడ్జెట్’ రూ.13 వేల వరకు ఉంటోంది.
ఇది ఆయా బడుల ‘స్థాయి’బట్టి ఆధారపడి ఉంటోంది. కొన్ని బడుల్లో విద్యార్థికి రూ.17 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తుండగా, కొన్నింటిలో రూ.10 వేల వరకు ఉంటోంది. ఆయా బడుల స్థాయి, వాటి సంఖ్యని పరిశీలిస్తే ఈ ఖర్చు ఒక్కో విద్యార్థిపై సగటున రూ.13 వేల వరకు నమోదవుతోంది. ఇద్దరు విద్యార్థులుంటే ఈ నెల బడ్జెట్ ఏకంగా రూ.25 వేలకు పెరుగుతోంది. అందుకే ఈ జూన్ టెన్షన్. ఈ లెక్కన జిల్లా జూన్ బడ్జెట్ ఎంతవుతోందో తెలు సా... అక్షరాలా రూ.520 కోట్లు. ప్రస్తుతం జిల్లాలో 4 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రైవేటు బడుల్లో చదువుతున్నారు. వీరిలో నగరానికి చేరువగా ఉన్న బడుల్లో చదివేవారి సంఖ్య ఎక్కువగా ఉంది.
|
|
|