అధికారుల ముందే సొమ్మసిల్లి..
Viewed:
148
Times | News ID:
117731228
|
|
- Posted by
Ranadheer
on
5/31/2012 12:58:58 PM
in
Nizamabad
,
Crime News
|
బిచ్కుంద: స్వయాన జిల్లా కలెక్టర్ సమక్షంలో ఉపాధి కూలీ సొమ్మసిల్లి.. ఆ తర్వాత చనిపోగా, విషయం ఆయన దృష్టికి వెళ్లకుండా జాగ్రత్తపడ్డారు. పడిపోయి న మహిళకు తోటి కూలీలు సపర్యలు చేస్తున్న విషయాన్ని అధికారులు గమనించినా.. స్పందించలేదు. సకాలంలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లలేదు. అరగంట ముందు ఆమెకు వైద్యచికిత్సలు అంది ఉంటే కచ్చితం గా బతికి ఉండేదని బంధువులు, కూలీలు అంటున్నా రు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న రైతు చైతన్యయాత్రలో పా ల్గొనేందుకు జిల్లా కలెక్టర్ డి. వరప్రసాద్ ఇతర అధికారులతో కలిసి వెళ్తున్నారు. గ్రామ శివారులోని చెరువు లో ఉపాధి హామీ పనులు జరుగుతుండగా, ఆయన వారిని పలకరించారు.
‘రోజు కూలీ ఎంత పడుతుం ది.. ప్రతి కూలీకి స్థానికంగా పని దొరుకుతుందా’అని అడిగారు. ఇదే క్రమంలో గ్రామానికి చెందిన కర్రోల్ల అనిత(25) సొమ్మసిల్లి పడిపోయింది. గమనించిన తోటి కూలీలు ఆమెకు సపర్యలు చేశారు. ఈ విషయా న్ని అక్కడే ఉన్న అధికారులు చూసినా మిన్నకున్నారు. కనీసం అటువైపు చూడకపోగా కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లలేదు. దీంతో కలెక్టర్ రైతు చైతన్యయాత్రలో పాల్గొనేందుకు వెళ్లిపోయారు. ఆయన వెంట బోధన్ ఆర్డీవో సతీష్‌చంద్ర, మండల ప్రత్యేక అధికారి శంకర్‌రెడ్డి, ఎంపీడీవో, తహశీల్దార్లు వెళ్లిపోయారు. అయితే అక్కడే ఉన్న అనిత భర్త హన్మాబాయి ఆమెను భుజంపై వేసుకొని తొలుత గ్రామానికి, అక్క డినుంచి ఆస్పత్రికి తరలించారు. ఆలోగానే అనిత చనిపోయింది. అనంతరం ఆర్డీవో సతీష్‌చంద్ర, తహశీల్దార్ గణేష్, ఎంపీడీవో పర్బన్నలు ఆస్పత్రికి వచ్చారు. గుం డెపోటు లేదా వడదెబ్బతో అనిత మృతి చెంది ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతురాలికి భర్త, నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నారు.
వడదెబ్బతో మరొకరు...
నిజామాబాద్ రూరల్ : మండలంలోని కేశాపూర్‌లో గాజుల సాయిలు(45) అనే ఉపాధి కూలీ బుధవారం వడదెబ్బతో మృతి చెందారు. వారం రోజుల క్రితం ఉ పాధి పనులు చేస్తుండగా వడదెబ్బ తగిలి అస్వస్తతకు గురైన సాయిలును జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించా రు. మంగళవారం రాత్రి ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చారు. అయితే బుధవారం ఉదయం ఆయన మరణించారు. మృతునికి భార్య గోదావరి ఉంది.
|
|
|