108 అంబులెన్స్‌లో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
Viewed:
157
Times | News ID:
117631227
|
|
- Posted by
Ranadheer
on
5/31/2012 12:57:51 PM
in
Nizamabad
,
General News
|
డిచ్పల్లి, మే 30 : 108 అంబులెన్స్ అత్యవసర సర్వీసుల్లో పని చేసేందుకు ఆసక్తి గలవారు దరఖాస్తులు చేసుకోవాలని 108 అంబులెన్స్ ఆపరేషన్ ప్రతినిధి వసంత్ చెప్పారు. బుధవారం డిచ్పల్లి పీహెచ్సీ వద్ద ఆయన విలేఖరులతో మాట్లాడారు. జూన్ 2వ తేదీ ఉదయం 9 గంటలకు నిజామాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో రిక్రూట్మెంట్ డ్రైవ్ జరగనుందని, ఇఎంటీ, ఈఆర్ఓఎస్ పైలట్ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. ఇఎంటీ ఉద్యోగాలకు కనీస విద్యార్హత బీఎస్సీ లైఫ్సెన్స్తో పాటు బీజడ్సీ ఉండాలని, 25 - 30 సంవత్సరాలు కలిగి ఉండాలన్నారు. అలాగే పైలట్ ఉద్యోగానికి పదో తరగతి పాసై ఉండాలని, హెవీ లైసెన్స్‌తోపాటు 5 సంవత్సరాల పాటు డ్రైవింగ్‌లో అనుభవం తప్పరిసరిగా ఉండాలని చెప్పారు. ఈఆర్ఎస్ఓఎస్కు ఏదైనా డిగ్రీ చదివి, కంప్యూటర్లో అనుభవం కలిగి ఉండాలని, వయస్సు 25-30 సంవత్సరాల మధ్య ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇఎంటీ, ఇఆర్ఒఎస్, పైలట్ పోస్టులు 100 వరకు ఖాళీగా ఉన్నాయన్నారు.
|
|
|