మంటల్లో రామగుండం ఎఫ్‌సీఐ
Viewed:
170
Times | News ID:
113531114
|
|
- Posted by
Ranadheer
on
5/31/2012 11:44:02 AM
in
Karimnagar
,
Crime News
|
కోల్‌సిటీ, మే 30 : రామగుండం ఎరువుల కర్మాగారం రెండు రోజులుగా మంటల వలయంలో చి క్కుకున్నది. మంగళవారం మధ్యా హ్నం యాష్‌పాండ్‌లోని చెట్ల పొదల్లో అంటుకున్న నిప్పు రాత్రికి పరిశ్రమలో ని ఒక వైపునకు వ్యాపించింది. జీఎం సీత సమాచారం మేరకు పెద్దపల్లి ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి, రామగుండం తహసిల్దార్ పద్మయ్య, ఎస్ఐ ఉపేందర్‌లు ప్లాంట్‌లో చేరుకునే సహాయక చర్యలు చేపట్టారు.
సింగరేణి రెస్క్యూ టీమ్ రం గంలోకి దిగింది. బుధవారం తెల్లవారుజామున మంటలు అదుపులోకి రాగా మళ్లీ 10గంటలకు మెయిన్‌గేట్ సమీపంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగా యి. స్క్రాప్యార్డులోని విలువైన కే బుళ్లు, ఇతర సామాగ్రి కాలిపోయాయి. ఎఫ్‌సీఐ పరిశ్రమకు చెందిన ఫైర్ సర్వీ స్తోపాటు గోదావరిఖని, రామగుండం ఏపీ జెన్కో, ఎన్టీపీసీకి చెందిన ఫైర్ స ర్వీసులు మంటలను ఆర్పే పనుల్లో ఉ న్నాయి. సాయంత్రానికి ఎఫ్‌సీఐ కూలింగ్ టవర్‌కు మంటలు వ్యాపించా యి.
కూలింగ్ టవర్ నిర్మాణంలో ట న్నుల కొద్ది కలప వాడడంతో పరిస్థితి తీవ్రంగా ఉంటుందని యంత్రాంగం కలవరపడింది. మొత్తం ఫైర్ సర్వీసులను అటువైపు పంపి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కూలింగ్ టవ ర్ రేకులు పగులగొట్టి సింగరేణి రె స్క్యూ, ఫైర్ సిబ్బంది ఎఫ్‌సీఐ కాంట్రా క్ట్ లేబర్లు పైపుల ద్వారా నీళ్లు చల్లు తూ మంటలను అదుపు చేశారు. యాష్‌పాండ్, మెయిన్ స్టోర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ సమీపంలో రాత్రి వ రకు మంటలు చెలరేగుతూనే ఉన్నా యి. యూరియా ప్లాంట్ వైపు మం టలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సింగరేణి నుంచి ట్యాం కర్లలో నీళ్లు తెప్పించి కొన్నికొన్ని ప్రాం తాల్లో నీటిని నిల్వ ఉంచుతున్నారు. రెండు రోజులుగా జరుగుతున్న అగ్ని ప్రమాదంతో లక్షల విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. అసలు ఎక్కడెక్కడ ఏమి దహనమయ్యాయో తెలుసుకునే పరిస్థితి లేకుండా పోయింది.
ం ఢిల్లీ కేంద్ర కార్యాలయానికి సమాచారం.. రామగుండం ఎరువుల కర్మాగారం లో రెండు రోజులుగా చెలరేగుతున్న మంటలు, బుధవారం కూలింగ్ టవర్ కు నిప్పంటుకున్న విషయంపై సంస్థ జీ ఎం సీత ఢిల్లీలోని కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. పరిస్థితి తీ వ్రంగా ఉందని, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఆర్డీఓ శ్రీనివాసరెడ్డి కూడా వెంటనే వేల సంఖ్యలో ఉ న్న చెట్ల తొలగింపునకు చర్యలు తీసుకోవాల్సిందిగా జీఎంకు సూచించారు. దీంతో ఈ విషయాన్ని కేంద్ర కార్యాలయానికి తెలపడంతో పరిస్థితిని సమీక్షించిన ఎఫ్‌సీఐ ఉన్నతాధికారులు వెం టనే చెట్లను తొలగించాలని, గురువారం నుంచి పనులు ప్రారంభించాలని ఆదేశించారు.
|
|
|