అగ్ని ప్రమాదంలో బాలుడి సజీవ దహనం
Viewed:
163
Times | News ID:
109030212
|
|
- Posted by
Ranadheer
on
5/30/2012 12:42:42 PM
in
Nizamabad
,
Crime News
|
కోటగిరి, మే 29 : మూడేళ్ల బాలుడు మ ంటల్లో చిక్కుకొని బూడిదయ్యాడు. తన ఇంటికి ప్ర మాదవశాత్తు నిప్పంటుకోగా మంటలకు భయపడి పక్కనే ఉన్న మరో గుడిసెలోకి చిన్నారి పరుగు తీశా డు. ఆ గుడిసెకు సైతం మంటలు వ్యాపించి బాలుడు ఆహుతయ్యాడు. ఈ సంఘటన కోటగిరి మండలంలోని జల్లాపల్లిలో మంగళవారం చోటుచేసుకుంది. న వీన్(3) బాలుడు అగ్నిప్రమాదంలో సజీవ దహనమ య్యాడు. గ్రామానికి చెందిన కుషాల్-బుజ్జిబాయి ద ంపతులకు ఐదుగురు కూతుళ్లు, ఓ కొడుకు ఉన్నారు. రోజూ మాదిరిగానే తల్లిదండ్రులు ఉపాధి పనులకు వె ళ్లారు. 11గంటల ప్రాంతంలో పిల్లలందరూ ఆడుకుంటుండగా నవీన్ వాళ్ల గుడిసెకు నిప్పంటుకుంది. మ ంటలకు భయపడి పిల్లలందరూ అక్కడి నుంచి వెళ్లిపోగా నవీన్ పక్కనే ఉన్న రమేష్ గుడిసెలోకి వెళ్లా డు. ఐదు గుడిసెలు ఇళ్లు ఒకే చోట ఉండటంతో వాట న్నింటికీ మంటలు వ్యాపించాయి. గుడిసెలో ఉన్న న వీన్ బయటకు వెళ్లలేక దహనమయ్యాడు. గ్రామస్థు లు అక్కడికి చేరుకుని బాలుడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ప్రమాదంలో న గదు, బంగారం తదితర వస్తువులు కాలిపోయాయి. మృతిచెందిన బాలుడి తల్లిదండ్రులు బోరున విలపించారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా జాయింట్‌కలెక్టర్ హర్షవర్ధన్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీ వో సతీష్‌చంద్ర, ఘటనా స్థలానికి చేరుకున్నారు. బా ధిత కుటుంబాలను ఓదార్చారు.
* ఎమ్మెల్యే శ్రీనివాస్‌రెడ్డి దిగ్భ్రాంతి ఈ ఘటనపై ఎమ్మెల్యే పోచారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలుడిని కోల్పోయిన తల్లిదండ్రుల ను, ఇతర బాధితులను ఆయన ఓదార్చారు. సర్వం కోల్పోయిన కుటుంబాలకు రూ.2వేల చొప్పున సహాయాన్ని అందజేశారు. విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధితులను ఆదుకునేందుకు కృషిచేస్తానన్నారు.
* బాధితులకు ఇళ్లు మంజూరు చేస్తాం: జేసీ బాలుడి మృతిపై జేసీ హర్షవర్దన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సహా యం, బియ్యం అందజేశారు. వారందరికీ ఐఏవై కిం ద ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.
|
|
|